📄 ePaper
Saturday, July 18, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriనారీశక్తికి వెన్నుపోటు పొడిచిన ప్రతిపక్షాలు - కొమ్మిడి మహిపాల్ రెడ్డి

నారీశక్తికి వెన్నుపోటు పొడిచిన ప్రతిపక్షాలు – కొమ్మిడి మహిపాల్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఘాట్ కేసర్ ఏప్రిల్ 17 (ప్రజావాణి) మహిళలకు రాజకీయంగా అధికారం కల్పించాలని, లోక్‌సభలో 33% రిజర్వేషన్ కోసం మోదీ ప్రభుత్వం నారీ శక్తి వందన్ అధినీయం బిల్లును ప్రవేశపెట్టింది. కానీ ప్రతిపక్షాల సహకారం లేక ఈ బిల్లు వీగిపోవడం సిగ్గుచేటు అని బీజేపీ ఘాట్ కేసర్ మండల అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి అన్నారు.

ఇది కేవలం ఒక బిల్లు ఓటమి కాదు, మన దేశ నారీశక్తికి ప్రతిపక్షాలు చేసిన అవమానం.

వాస్తవం ఇదే, ప్రతిపక్షాలకు మహిళలు అంటే కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే. మహిళలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించడం వారికి ఇష్టం లేదు. మహిళా సాధికారతను అడ్డుకోవడమే వారి అసలు లక్ష్యం.

మహిళలను రాజకీయంగా ఎదగనివ్వకుండా అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలను ఈ దేశం ఎన్నటికీ క్షమించదు అని ఘాట్ కేసర్ బీజేపీ మండల అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular