📄 ePaper
Saturday, July 18, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriమరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్ధిక సహాయాన్ని అందజేసిన శివరాత్రి వెంకటేష్ రాష్ట్ర వడ్డెర సంఘము...

మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్ధిక సహాయాన్ని అందజేసిన శివరాత్రి వెంకటేష్ రాష్ట్ర వడ్డెర సంఘము ఉపాధ్యక్షులు  

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్ ఏప్రిల్ 17 (ప్రజావాణి) మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మున్సిపల్ సర్కిల్ లోని పోచారం డివిజన్ ఎనిమిదో వార్డులోని అన్నోజిగూడ లక్ష్మీనరసింహ కాలనీలో వేముల లక్ష్మమ్మ(వడ్డెర ) మరణించడంతో విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి వెంకటేష్ వెంటనే స్పందించి దహన సంస్కారాల కోసం 5000 వేల రూపాయలు ఘట్కేసర్ మండల వడ్డెర కుల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు అన్నోజిగూడ మాజీ వార్డు సభ్యులు బోదాసు వెంకటేష్ చే మరణించిన వేముల లక్ష్మమ్మ కుటుంబ సభ్యులకు అందజేసి ఆమె కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, అవసరమైనప్పుడు వడ్డెర సంఘం ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కులస్తులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular