ఏలూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16) కాకినాడ 2 టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ మరియు యు.కొత్తపల్లి పోలీస్ స్టేషన్లలో ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐపీఎస్ గారి వార్షిక తనిఖీలువార్షిక తనిఖీలలో భాగంగా ఈరోజు ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐపీఎస్ గారు కాకినాడ 2 టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ మరియు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లను సందర్శించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. వారి వెంట జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్, ఐపీఎస్ గారు ఉన్నారు. మొదట కాకినాడ 2 టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఐజి గారికి పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించగా, అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. కేసు ఫైళ్లు, స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, మిస్సింగ్ కేసుల దర్యాప్తు పురోగతి తదితర అంశాలను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. తరువాత ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఉప్పాడ కొత్తపల్లి పోలీసు స్టేషన్ కు చేరుకుని వార్షిక తనిఖీలు నిర్వహించినారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లలోని క్రైమ్ రికార్డులు, సెంట్రీ బుక్, జనరల్ డైరీ మొదలగు రిజిస్టర్లు మరియు సి.సి.టి.ఎన్.ఎస్ (CCTNS) డేటా ఎంట్రీలను పరిశీలించిన ఐజీ గారు రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆదేశించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని సూచించారు. రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేసి నేర నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా పాత నేరస్తుల గుర్తింపును మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ ఉపయోగాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈగల్ టీమ్‌తో సమన్వయం చేసుకుంటూ గంజాయి మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పోలీస్ లాగిన్స్ వినియోగంలో మరింత ముందుండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వారి సమస్యలను ఓపికగా విని త్వరిత పరిష్కారం చూపడం ద్వారా ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’పై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని తెలిపారు.అలాగే స్టేషన్ ఆవరణలోని రిసెప్షన్ కౌంటర్,లాకప్ రూమ్, సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాలు,పారిశుద్ధ్యం మరియు భద్రతా ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేసి అవసరమైన మార్గదర్శకాలు అందించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్, ఏఎస్పీ శ్రీ పాటిల్ దేవ్ రాజ్ మనీష్, ఐపీఎస్, ఎస్బీ డీఎస్పీ శ్రీ కె.వి.వి. సత్యనారాయణ, కాకినాడ 2 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. అప్పలనాయుడు, కాకినాడ రూరల్ సిఐ శ్రీ డి. చైతన్య కృష్ణ, ఇంద్రపాలెం ఎస్సై శ్రీ ఎం. వీరబాబు మరియు పిఠాపురం సీఐ శ్రీ జి శ్రీనివాసు, ఎస్సైలు జి వెంకటేష్, జానీ భాషా ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
కాకినాడ 2 టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ మరియు యు.కొత్తపల్లి పోలీస్ స్టేషన్లలో, తనిఖీ, ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్
0
6
RELATED ARTICLES
- Advertisment -




