కడపజిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15)పోరుమామిళ్ల :తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా యనమల సుధాకర్ నియామకం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం రాష్ట్ర కమిటీలో పోరుమామిళ్ల మేజర్ సర్పంచ్ యనమల సుధాకర్ నాయుడుని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించినట్లు యనమల సుధాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వారిని గుర్తిస్తూ రాష్ట్ర పోలిట్ బ్యూరో కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అందులో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం నా వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు, తెలుగుదేశం నాయకులకి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
Homeఆంధ్రప్రదేశ్తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా యనమల సుధాకర్ నియామకం
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా యనమల సుధాకర్ నియామకం
0
9
RELATED ARTICLES




