📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జి.వి. సత్రం గ్రామంలో నిర్మించబడిన శ్మశానవాటికను మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ఘనంగా...

జి.వి. సత్రం గ్రామంలో నిర్మించబడిన శ్మశానవాటికను మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ఘనంగా ప్రారంభించారు..

📰 Generate e-Paper Clip

కడపజిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్13)మైదుకూరు మండలంలోని జి.వి.సత్రం గ్రామంలో నిర్మించబడిన శ్మశానవాటికను మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్  ఘనంగా ప్రారంభించారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ శ్మశానవాటిక గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలవనుంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే.మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక అవసరాలైన శ్మశానవాటికలు,రహదారులు,తాగునీరు వంటి మౌలిక వసతులను కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని తెలిపారు.మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 68 శ్మశానవాటికలను మంజూరు చేయగా,వాటిలో దాదాపు 40 నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగతా పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.ఈ శ్మశానవాటిక నిర్మాణంతో ఆర్యవైశ్య సమాజానికి ఎంతో ఊరట లభించిందని స్థానికులు తెలిపారు.తమ సమాజానికి ప్రత్యేకంగా శ్మశానవాటికను ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి,శాలువాతో సన్మానించి ఘనంగా గౌరవించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు శ్మశానవాటిక చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అలాగే అక్కడికి సులభంగా చేరుకునేందుకు సీసీ రోడ్ నిర్మించాలని ఎమ్మెల్యే గారిని కోరారు.ప్రజల అభ్యర్థనపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి,ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు సీసీ రోడ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ప్రజల అవసరాలను వెంటనే గుర్తించి స్పందించడం ద్వారా ఎమ్మెల్యే అభివృద్ధి పట్ల తన నిబద్దతను మరోసారి చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు. ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular