కడపజిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్13)మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆకస్మిక తనిఖీ మధ్యాహ్న భోజనంపై విద్యార్థులతో సమగ్ర సమీక్ష,పాఠశాలకు కాంపౌండ్ వాల్ మంజూరు చేయాలని తక్షణ ఆదేశాలు.మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ నంద్యాలంపేట జెడ్‌పీ హై స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించి,అక్కడ అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సమగ్రంగా పరిశీలించారు.ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే ,నేరుగా వంటశాలను,భోజనం వడ్డించే విధానాన్ని పరిశీలిస్తూ,విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యత మరియు పరిమాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో సన్నిహితంగా ముచ్చటించిన ఎమ్మెల్యే,వారికి అందుతున్న భోజనం రుచిగా ఉందా,సరిపడా ఇస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి ప్రతిస్పందించిన విద్యార్థులు,భోజనం మంచి నాణ్యతతో పాటు అందరికీ సరిపడా అందిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.తదుపరి,ఎమ్మెల్యే.ప్రతి తరగతి గదిని సందర్శిస్తూ,ఒక్కొక్క విద్యార్థితో మాట్లాడి వారి చదువు పరిస్థితులు,పాఠశాలలో ఉన్న సౌకర్యాలు,ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు.విద్యార్థుల అభిప్రాయాలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే,వారికి అవసరమైన సౌకర్యాల కల్పనలో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు.ఈ సందర్బంగా పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాఠశాలకు కాంపౌండ్ వాల్ అత్యవసరం ఉందని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేశారు. పాఠశాల భద్రత, విద్యార్థుల రక్షణ దృష్ట్యా ఇది అవసరమని వివరించారు. దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, కంపౌండ్ వాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కఠిన ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా,విద్యార్థులకు ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ,“మీరు బాగా చదివి మంచి మార్కులు సాధించి మీ కుటుంబానికి, సమాజానికి గౌరవం తీసుకురావాలి.ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలి” అని ప్రోత్సహించారు.ఈ ఆకస్మిక తనిఖీ ద్వారా పాఠశాలలో అమలవుతున్న పథకాలపై ప్రత్యక్ష అవగాహన పొందిన ఎమ్మెల్యే, విద్యార్థుల సంక్షేమం మరియు విద్యా అభివృద్ధి పట్ల తమ నిబద్దతను మరోసారి చాటిచెప్పారు.
Homeఆంధ్రప్రదేశ్మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆకస్మిక తనిఖీ''మధ్యాహ్న భోజనంపై విద్యార్థులతో సమగ్ర సమీక్ష.
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆకస్మిక తనిఖీ”మధ్యాహ్న భోజనంపై విద్యార్థులతో సమగ్ర సమీక్ష.
0
3
- Advertisment -




