వరుకోలు లో రోడ్డు భద్రతపై గ్రామసభ
బెజ్జంకి -కోహెడ, ఏప్రిల్ 13(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని వరుకోలు గ్రామంలో రోడ్డు భద్రత పై గ్రామ సభ గ్రామ సర్పంచ్ సుధగోని దేవరాజు అధ్యక్షతన జరిగింది. ఈ గ్రామ సభకు విలేజ్ పోలీస్ అధికారి తిరుపతి ముఖ్యఅతిథిగా హాజరై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేవరాజు, పోలీస్ అధికారి తిరుపతి మాట్లాడుతూ రహదారుల ఇరవైపు పెరిగిన పొదలు, చెట్ల కొమ్మలు, గుంతలు. వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నాయని మైనర్లు బైకు నడపడం వల్ల ప్రమాదాలకు గురైన సంఘటనలు జరుగుతున్నాయని. తల్లిదండ్రులు పిల్లలకు బైకులు ఇవ్వకూడదని. అలాగే బైకులు నడిపే వారు తప్పనిసరిగా లైసెన్స్, హెల్మెట్, ధరించాలని పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో గ్రామ ప్రజల సహకారంతో రోడ్లపై గుంతలను పూచడం వలన వాహనదారులకు, పాదాచారులకు భద్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ ఆకునూరి బాబు, ఉపసర్పంచ్ ఆలేటి కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నిర్మల జయరాజ్, వార్డు మెంబర్లు, వైద్య సిబ్బంది, అంగన్వాడి వర్కర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..




