📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మదనపల్లె ఆర్ఓ కు పల్లవి అరెస్ట్ వారెంట్

మదనపల్లె ఆర్ఓ కు పల్లవి అరెస్ట్ వారెంట్

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్13) బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్ గా పనిచేసి ప్రస్తుతం మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్ఓ ) జీవి.పల్లవి అరెస్ట్ కు హైకోర్టు ఈనెల 2న ఉత్తర్వు జారీ చేసింది. ఆమెను అరెస్ట్ చేసి ఈనెల 30న న్యాయస్థానం ముందు హజరుప ర్చాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. మున్సిపాలి టీలో ఒక వ్యక్తి ప్లాన్ అప్రూవల్ లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టారని, అక్రమంగా జరుగుతున్న ఈ పనిని కమిషనర్ అడ్డుకోలేదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చూపారని పేర్కొంటూ రెడ్డెప్ప అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నడుస్తుండగా విచారణ కోసం పల్లవిని ఆన్లైన్ లో హజరు కావాలని తెలియజేసిన ప్పటికి ఆమె హజరు కాలేదని కోర్టు దృష్టికి వచ్చింది. దీన్ని కోర్టు ధిక్కారంగా భావిస్తూ ఆమెకు బెయిలబుల్ వారంట్ ను జారీ చేయాలని న్యాయ స్థానం ఆదేశించింది. ఈనెల 30 జరిగే తదుపరి విచారణ రోజు ఆమె కోర్టు ఎదుట హజరుకా వాలని ఆదేశించింది. ఈ వారెంట్ ను అమలు చేయాలని జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలను పంపారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే రూ.10వేల బాండు, ఇద్దరి పూచికత్తుపై బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. అలాగే ఈనెల 30న జరిగే కేసు వాయిదాకు హజరవుతానని, ఆ తర్వాత కూడా కోర్టు ఆదేశించే వరకు హజరు వుతానని ఆమె ప్రమాణపత్రం ఇవ్వాలని ఆదే శాల్లో న్యాయస్థానం పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular