📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetమిరుదొడ్డి మండలంలోని అల్వాల్ గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు...

మిరుదొడ్డి మండలంలోని అల్వాల్ గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన పక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట్, మిడిదొడ్డి, ఏప్రిల్ 5, ప్రజావాణి

మిరుదొడ్డి మండలంలోని అల్వాల్ గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన పక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆహార పదార్థాలను పరిశీలించారు. కూరల నాణ్యత మెరుగుపరచాలని కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని వండిన ప్రతి వంటకం రుచికరంగా ఉండి విద్యార్థులకు కడుపునిండా తినే విధంగా ఆహారం వండాలని వార్డెన్ కు సూచించారు. ఇదివరకు పర్యవేక్షణలో వంట గది పరిసరాలు అపరిశుభ్రంగా ఉందని ఇప్పుడు కొంచెం బెటర్ కానీ విద్యార్థులకు భోజనం చేయగానే వెంటవెంటనే క్లీన్ చేసుకోవాలని ఆదేశించారు. రోజు విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు అందించాలని భోజనం వసతి చదువు విషయంలో రాజి పడవద్దని విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా చూసుకోవాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.