రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని-
రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. మెడికల్ ఆఫీసర్ అరెపల్లి లో ఫీల్డ్ విసిట్ లో ఉన్నట్లు సిబ్బంది తెలపగా వీడియో కాల్ చేసి నిజనిర్ధారణ చేశారు. ఏదో ఒక సాకు చెబుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రోజు వారిగా ఆసుపత్రి సమయ వేళలు పాటించాలని ఎల్లపుడు రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం రాయపోల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనికి చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. తహసిల్దార్ నుండి కింది స్థాయి సిబ్బంది వరకు సమయ వేళలు పాటించాలని ఆదేశించారు. రిజిస్టేషన్ వివరాలు ఆరా తీశారు.ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ బిఎల్ఓ పని తీరును పర్యవేక్షణ చెయ్యాలని తహసీల్దార్ ను ఆదేశించారు.రీజనల్ రింగ్ రోడ్ భూ సేకరణలో మండలంలోని ఆయా గ్రామాల్లో భూ యజమానులతో మాట్లాడి ఆర్బిటరేషన్ 100 శాతం పూర్తి చెయ్యాలని తహసిల్దార్ ను ఆదేశించారు.




