*ప్రొద్దుటూరు టిడిపి మాజీ ఇంచార్జ్ డాక్టర్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్…*
👉 ప్రొద్దుటూరు మార్కెట్ యార్డులో సెనగ రైతులను టిడిపి నాయకులమని చెప్పుకునే రసూల్ గౌస్ , సుధాకర్లు దోపిడీ చేస్తున్నారు…
👉 శనగలు ఒక్కో బస్తాకు రెండు కేజీలు అదనంగా తూకం వేసుకుంటున్నారు…
👉 వివిధ రకాల ఫీజులు పేరు చెప్పి ఒక బస్తాకు రూ.200 వసూలు చేస్తున్నారు…
👉 మార్కెట్ యార్డ్ కమిటీ ఒక బస్తాకు హమాలీలకు , ఇతర అన్ని రకాల ఖర్చులతో
రూ. 45 అని అధికారులు లేఖ ఇచ్చారు…
👉 తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని పార్టీకే చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్న రసూల్ గౌస్ , సుధాకర్లపై చర్యలు తీసుకోవాలి…
ఎంతో శ్రమించి రైతుల పంట పండిస్తే మార్కెట్ యార్డులో రైతులను దోపిడీకి గురి అవుతున్నారు…
👉 ఈ విషయాన్ని ఇప్పటికే మార్కెట్ యార్డ్ స్థానిక , జిల్లా అధికారులతో పాటు , ఆ శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లా…
దీనితోపాటు ప్రతి వాహనానికి చెల్లించాల్సిన రూ.15 నుంచి రూ. 20వేల రూపాయల పన్నును కూడా మార్కెట్ యార్డ్ కమిటీకి ఎగరగొట్టి , ఇదేమని ప్రశ్నిస్తే మార్కెట్ యార్డ్ కమిటీ అధికారులను బెదిరిస్తున్నారు…
👉 ఈ విషయం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారికి కాని, వారి తమ్ముడు రాఘవ రెడ్డి గారికి కానీ తెలిసి ఉండదు అని తాను అనుకుంటున్నానని , ఎందుకంటే వారు కూడా ఒక రైతు కాబట్టి , రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ,…
👉 ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఈ విషయంలో కలగజేసుకొని రైతుల నుంచి వసూలు చేస్తున్న అక్రమ వసూళ్లను ఆపాలి… ఇప్పటివరకు వసూలు చేసిన డబ్బులు రైతులకు వెనక్కి ఇప్పించాలి…
👉 రసూల్ గౌస్ , సుధాకర్ అనే వ్యక్తులు రైతులను బెదిరిస్తున్న ఆడియో పుటేజీలు , అధికారులు వారు బెదిరిస్తున్న తీరుపై బాధపడి మాట్లాడిన పుటేజీలు తీసుకొని ముఖ్యమంత్రి వద్దకు వెళుతున్నా…
👉 గత ప్రభుత్వంలో చేయని తప్పులకు జైలుకు వెళ్లా … ఈరోజు రైతుల నుంచి అక్రమ వసూళ్లు ఆపకపోతే వారికి న్యాయం జరగడం కోసం ఏదో ఒకటి చేసైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధం…
👉 మేము చెబితే ఎమ్మెల్యే చెప్పినట్లే , ఎమ్మెల్యే కొడుకు కొండారెడ్డి చెప్పినట్లే అని చెప్పుకుంటున్న రసూల్ గౌస్ భూ దందాలకు పాల్పడిన విషయంపై కూడా ఆధారాలు సేకరిస్తున్నా , త్వరలో ఆ విషయంపై కూడా ప్రెస్ మీట్ పెడతా…
👉 2019 నుంచి 2023వ సంవత్సరం వరకు రసూల్ గౌస్ అనే వ్యక్తి ఏ పార్టీలో ఉన్నాడు , ఏ రోజైనా టీడీపీ తరపున ఒక్క పోస్టు పెట్టాడా , టిడిపి అధికారంలోకి వస్తూనే వీరే టిడిపి పార్టీని కాపాడినట్లు వ్యవహరిస్తున్నారు…




