📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammam35 సంవత్సరాల "దళారి వ్యవస్థకు చెక్ పెట్టిన" మన ప్రజావాణి తెలుగు దినపత్రిక 

35 సంవత్సరాల “దళారి వ్యవస్థకు చెక్ పెట్టిన” మన ప్రజావాణి తెలుగు దినపత్రిక 

📰 Generate e-Paper Clip

35 సంవత్సరాల “దళారి వ్యవస్థకు చెక్ పెట్టిన” మన ప్రజావాణి తెలుగు దినపత్రిక

 

చెరువుకు విముక్తి….!

 

తెలంగాణలో తొలి సంఘంగా గుర్తింపు పొందిన పందిళ్ళపల్లి

 

 

 

 

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ప్రత్యేక కథనం

 

ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం వరకు దాదాపు పెట్టుబడుదారులు కార్పొరేట్ శక్తులు తెలంగాణ రాష్ట్రంలో చేపల చెరువులు కుంటలు రిజర్వాయర్లు గుప్పెట్లో పెట్టుకొని మత్స్య సహకార సంఘం సభ్యులు మధ్య విభేదాలు రాజేసి వ్యాపార సమాజాన్ని విస్తరించుకొని కోట్ల రూపాయలు సంపాదించారు. అసలు మత్స్యకారులకు కూర చేపలు మందు విందు తాత్కాలికంగా ఇచ్చి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ జరుగుతున్నప్పటికీ రాజకీయ నాయకులు పెట్టుబడుదారులు బినామీలు బ్రోకర్లు ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ వరకు సంఘాలను గుప్పెట్లో పెట్టుకొని మత్స్యకారుల హక్కుల హక్కులను భంగం కలిగిస్తూ కోట్లు వెనకేసుకున్నారు. ఈ విషయ పై మన ప్రజావాణి తెలుగు దినపత్రిక సమగ్ర కథనాలు అందించిన సంగతి తెలిసిందే

 

ఈ నేపథ్యంలో పందిళ్ళపల్లి సొసైటీ పాలకవర్గం సభ్యులు దళారీ వ్యవస్థకు వ్యతిరేకంగా మన ప్రజావాణి తెలుగు దినపత్రిక అందించిన సంచలన కథనాల కు స్పందనంగా తీర్మానం చేసి ఆమోదించి జిల్లా మత్స్య శాఖ అధికారి శివ కుమార్ కు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మత్స్య శాఖ ఏడి మాట్లాడుతూ ఇచ్చిన తీర్మానం ప్రకారం క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేసి పందిళ్ళపల్లి పెద్ద చెరువు కుమ్మరి కుంట మాదిగకుంట ఊరకుంటలలో ఉచిత చేపలను పంపిణీ చేసి మత్స్యకారుల జీవనోపాధికి కృషి చేస్తామని శివ ప్రసాద్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular