📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రజావాణి అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి – జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

📰 Generate e-Paper Clip

*ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి – జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 16 ప్రజావాణి): ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.

సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్‌షాలోమ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు.

ఈ సందర్భంగా 298 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారాలను వేగవంతం చేయాలని, పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ రోజు ప్రజావాణికి వచ్చిన కొన్ని దరఖాస్తులు:

జిల్లాకు చెందిన వివిధ జర్నలిస్టు సంఘాలు, వార్తాపత్రికలు, మీడియా సంస్థల ప్రతినిధులు – వార్తాపత్రికలు, మీడియా సంస్థలకు వచ్చే అర్హత గల ప్రకటనల ఆదాయంలో 10 శాతం వాటాను జర్నలిస్టుల పెన్షన్, సంక్షేమ నిధికి కేటాయించాలని, ప్రభుత్వం తరపున అదనంగా 3 శాతం వాటా అందించాలని, ప్రత్యేక బ్యాంకు ఖాతా ఏర్పాటు చేసి పారదర్శక ఆడిటింగ్‌తో నిధిని నిర్వహించాలని, అర్హులైన పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన జర్నలిస్టులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించేలా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.

జనగామ పట్టణానికి చెందిన గజ్జెల నరేష్ – తన కుమారుడు గజ్జెల సుధాన్ష్‌కు 91 శాతం వినికిడి లోపం ఉన్నందున దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

పాలకుర్తి మండలం, సిరిసన్నగూడెం గ్రామానికి చెందిన సంసి కొమురమల్లు – తన పట్టా భూమికి సంబంధించి ఇతరులు అక్రమంగా పట్టా చేసుకున్నారని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.

జఫర్‌గఢ్ మండలం, తిమ్మంపేట గ్రామానికి చెందిన మంద రాజయ్య – తన భూమికి సంబంధించి తనకు బదులుగా తన సోదరుడి పేరున పట్టా నమోదైందని, సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

లింగాల ఘనపురం మండలం, పటేల్ గూడెం గ్రామానికి చెందిన జోగు యాదయ్య – వికలాంగుల పింఛను ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు.

ఈ ప్రజావాణిలో జెడ్పీ సీఈవో బలరామ రావు, డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చిన కోట్యా నాయక్, ఎస్ఈ ఎన్పీడీసీఎల్ సంపత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.