నేరడిగుంటలో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం
నేరేడు గుంట సెప్టెంబర్ 11: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
నేరడిగుంట గ్రామానికి చెందిన బైకాడి లచ్చమ్మ మృతి చెందడంతో, ఆమె కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ వొగ్గు సాయికిరణ్ పరామర్శించి అండగా నిలిచారు.
సర్పంచ్ వొగ్గు సాయికిరణ్ తరఫున రూ.5,000 ఆర్థిక సహాయాన్ని ఉపసర్పంచ్ ఈశ్వర్ మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు బోయిని శంకర్, వొగ్గు దేవయ్యతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.
