ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలుచాకలి ఐలమ్మ వర్ధంతి
* జాతీయ బీసీ సంక్షేమ సంఘముహుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఇంగిలే రామారావు
జమ్మికుంట సెప్టెంబర్ 10 (ప్రజావాణి)
జమ్మికుంట లో ఇందిరానగర్ చౌక్ వద్దగల చాకలి ఐలమ్మ విగ్రహానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘము హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలుసబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతీక భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన ధీరవనిత దొరల గడీలను ఎదురించి పోరాట పటిమ మనందరికీ స్పూర్తిదాయకం అన్నారుఈ కార్యక్రమంలో నాయకులు అశోక్ గోపాల్ రెడ్డి సందీప్ అన్వేష్ రాజురమేష్ తదితరులు పాల్గొన్నారు
