మా ఎమ్మెల్యే శంకరన్న మాటిస్తే.. అభివృద్ధి పరుగులే
శరవేగంగా రావిర్యాల బ్రిడ్జి పనులు
రూ.3.5 కోట్లతో కొనసాగుతున్న పనులు
పనులు పర్యవేక్షించి సంతోషం వ్యక్తం చేసిన జిల్లేడు చౌదరి గూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చలివేంద్రం పల్లి రాజు మరియు రావిర్యాల సర్పంచ్ నీలయ్య
జిల్లేడు చౌదరిగూడెం
వర్షాకాలం వచ్చిందంటే చాలు రావిర్యాల గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాగు వచ్చిందంటే చాలు గ్రామాల నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి ఇది.. ఎందరో నాయకులు ఎన్నికలవేళ వచ్చారు.. పోయారు.. కానీ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న మాత్రం గతంలో ఈ వాగు పరిస్థితిపై గ్రామస్తుల గోడు విన్నారు.. మీ హయాంలోనైనా ఎలాగైనా గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేయించాలని వేడుకున్నారు. గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో నేను మాటిస్తున్నాను.. రావిర్యాలకు బ్రిడ్జి నిర్మించి తీరుతానని మాట ఇచ్చారు.. మాటిచ్చిన కొద్ది రోజుల్లోనే రావిర్యాల బిడ్జికి రూ.3 కోట్ల 50 లక్షలు మంజూరు చేయించారు. వెంటనే పనులు ప్రారంభించారు. గుత్తేదారుతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పిన మాట ఒక్కటే.. రావిర్యాల ప్రజలకు మాటిచ్చాను వచ్చే వానాకాలం వరదల సమయానికి ప్రజలు ఇబ్బందులు లేకుండా బ్రిడ్జిపై ప్రయాణించే విధంగా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ పనులను ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చలివేంద్రం పల్లి రాజు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో కాస్త గుత్తేదారుకు మట్టి తవ్వకాలు ఇబ్బందులు ఏర్పాటు అయినప్పటికీ వాటిని అధిగమించి వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రాత్రింబవళ్లు షిఫ్ట్ ల వారిగా కార్మికులు పనిచేస్తున్నారు. ఇంతే తరహాలో వచ్చే రెండు నెలల్లో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.
*బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చలివేంద్రం పల్లి రాజు*
రావిర్యాల వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను జిల్లేడు చౌదరి గూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చలివేంద్రం పల్లి రాజు పనులను ఆదివారం పరిశీలించారు. కార్మికులు 24 గంటల పాటు ఇక్కడ పనులు చేస్తుండడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వచ్చే వర్షాకాలం నాటికి బ్రిడ్జి నిర్మాణం జరిగితే మా ఎమ్మెల్యే శంకరన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు. ఏదేమైనా జిల్లేడు చౌదరిగూడ మండలానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగే అవకాశం ఉందని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రావిర్యాల సర్పంచ్ నీలయ్య, వార్డు సభ్యులు మహేందర్, గ్రామస్తులు సుధాకర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.




