🔥 కామారెడ్డిలో కాంగ్రెస్కు బలమైన బూస్ట్…
జిల్లా జనరల్ సెక్రటరీ గా సోమన్న గారి రాజు నియామకం 🔥
కామారెడ్డి, ప్రజావాణి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమన్న గారి రాజు ను జిల్లా జనరల్ సెక్రటరీగా నియమిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్న నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ నియామకంతో స్పష్టం చేసింది.
జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీ కార్యకలాపాల్లో ముందుండే రాజుకు పదవి దక్కడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయనకు ఉన్న సామాజిక మద్దతు, అనుభవం పార్టీ బలోపేతానికి దోహదం చేస్తాయని నాయకులు అభిప్రాయపడుతున్నారు
.
ఈ సందర్భంగా సోమన్న గారి రాజు మాట్లాడుతూ … తనపై నమ్మకం ఉంచిన పార్టీ అగ్రనేతలకు, జిల్లా నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు.
పార్టీ బలోపేతం, కార్యకర్తల ఐక్యతే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న సుధాకర్, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ జెండాను మరింత ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.




