📄 ePaper
Friday, March 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” విజన్ సాధనలో మంగళగిరిని ముందంజ లో నిలిపే విదంగా చర్యలు. ...

స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” విజన్ సాధనలో మంగళగిరిని ముందంజ లో నిలిపే విదంగా చర్యలు. •మంత్రి శ్రీ నారా లోకేష్

📰 Generate e-Paper Clip

మంగళగిరి ప్రజావాణిన్యూస్(మార్చి26)పరిశుభ్రత ప్రజలందరి బాధ్యత – ప్రజలలో అవగాహన కల్పించటమే స్వచ్ఛ మంగళగిరి 2.0 ప్రధమ లక్ష్యం. పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణను మరింత బలోపేతం చేయడానికి రూపొందించిన “స్వచ్ఛ మంగళగిరి 2.0”కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు నేడు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి లోని మంగళగిరి లో టిప్పర్ల బజార్ -2 ,తాడేపల్లి కుంచన పల్లి,గుండిమెడ గ్రామాల నందు ప్రారంబించుట జరిగినది.ఈ కార్యక్రమంలో గుండిమెడ నందు నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా గారు పాల్గొని పరిశుభ్రత చర్యలను స్వయంగా పరిశీలించారు. అనంతరం నగర ప్రజలకు కర పత్రాలు అందచేసి ప్రజలకు అవగాహన కలిపించి వార్డులో సిబ్బందితో కలిసి పర్యటించి గుర్తించిన సమస్యలను త్వరిత గతిన పూర్తి చేయలని సూచించి పరిశుభ్రత కోసం కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ గారు మాట్లాడుతూ,“స్వచ్ఛ మంగళగిరి” మొదటి దశ ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం కలిగించడంలో కీలక పాత్ర పోషించిందని, గౌరవ ఐటీ మరియు విద్యా శాఖ మాత్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు 2.0 దశలో మరింత సమర్దవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిని పూర్తిస్థాయిలో స్వచ్ఛ మంగళగిరి గా తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యముగా పని చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.మంగళగిరి పరిధి లోపాల్గొన్న అడిషనల్ కమీషనర్ శకుంతల గారు మాట్లాడుతూ ,గ్రామ స్థాయి ప్రత్యేక పరిశుభ్రత డ్రైవ్‌లు, ప్లాస్టిక్ నిర్మూలనా చర్యలు, ప్రజలకు, పాఠశాలల మరియు కళాశాలల విద్యార్ధులకు,అవగాహన కార్యక్రమాలు, విసృతంగా నిర్వహిస్తామని “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” విజన్ సాధనలో మంగళగిరి ముందంజలో నిలవాలని, ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమని తెలిపారు.అనంతరం సెక్రెటరీ శ్రీనివాసరావు మాట్లాడుతూ “స్వచ్ఛ మంగళగిరి 2.0” కార్యక్రమం పట్టణ రూపురేఖలను మార్చడమే కాకుండా ప్రజల్లో శుభ్రతపై శాశ్వత అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సహకారం ఉంటే మంగళగిరి–తాడేపల్లి రాష్ట్రంలోనే అత్యంత పరిశుభ్ర పట్టణంగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో నగర పాలక సంస్థ అడిషనల్ కమీషనర్ శకుంతలసెక్రెటరీ శ్రీనివాసరావు ,కూటమి నాయకులు,ఇంజినీరింగ్ అధికారులు,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular