📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetసిద్దిపేట సురక్ష నేత్ర' రెండో విడత ప్రారంభం – కమిషనరేట్ వ్యాప్తంగా 152 సిసి కెమెరాల...

సిద్దిపేట సురక్ష నేత్ర’ రెండో విడత ప్రారంభం – కమిషనరేట్ వ్యాప్తంగా 152 సిసి కెమెరాల ఏర్పాటు.

📰 Generate e-Paper Clip

సిద్దిపేట సురక్ష నేత్ర’ రెండో విడత ప్రారంభం – కమిషనరేట్ వ్యాప్తంగా 152 సిసి కెమెరాల ఏర్పాటు.

సిద్దిపేట, మార్చి 26, ప్రజావాణి

ప్రజల రక్షణ నేర నియంత్రణే లక్ష్యంగా సిద్దిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ రెండో విడత కార్యక్రమం నేడు ఘనంగా ప్రారంభమైంది. కమిషనరేట్ పరిధిలోని 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 152 నూతన సిసి కెమెరాలను గురువారం ప్రారంభించడం జరిగినది. మొదటి విడతలో 200+ కెమెరాలు మార్చి 02 వ తేదీన ప్రారంభించడం జరిగినది.చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 26 సిసి కెమెరాలను కమిషనర్ ఆఫ్ పోలీస్ రష్మీ పెరుమాళ్, స్వయంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సిపి  మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో సిసి కెమెరాలు ‘మూడో కన్ను’గా పనిచేస్తాయని, నేరస్తులను పట్టుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.కమిషనరేట్ పరిధిలోని చిన్నకోడూరు మండలం చంద్లపూర్ గ్రామంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్  10 సీసీ కెమెరాలు ప్రారంభించారు, సిరిసినగండ్ల గ్రామంలో 23 సీసీ కెమెరాలను ప్రారంభించిన అదనపు డిసిపి ఏఆర్ సుభాష్ చంద్రబోస్, . మిగిలిన 09 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆయా పోలీసు అధికారులు మిగిలిన కెమెరాలను ఏకకాలంలో ప్రారంభించారు.ఈ సురక్ష నేత్ర ముందడుగు కార్యక్రమం ద్వారా కాలనీలు, ప్రధాన కూడళ్లు మరియు గ్రామాలలో నిరంతర నిఘా కొనసాగుతుంది. సిద్ధిపేట ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పరిసరాల్లో సిసి కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని సిపి రష్మీ పెరుమాళ్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular