📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సిద్దిపేట జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు: సైబర్ నేరాలపై విస్తృత అవగాహన..-శ్రీనివాసు ,...

సిద్దిపేట జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు: సైబర్ నేరాలపై విస్తృత అవగాహన..-శ్రీనివాసు , డీఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీస్..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు: సైబర్ నేరాలపై విస్తృత అవగాహన..-శ్రీనివాసు , డీఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీస్..

సిద్దిపేట జిల్లా, మార్చి 9, ప్రజావాణి

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళల రక్షణే ధ్యేయంగా భారీ ఎత్తున సైబర్అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సిద్దిపేట మండలం పొన్నాల గ్రామంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీనివాసు ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో విద్యార్థినులకు సైబర్ మోసాల పట్ల స్పష్టమైన అవగాహన కల్పించారు.సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌తో కలుపుకొని కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 24 అవగాహన కార్యక్రమాలనువిజయవంతంగా నిర్వహించారు. చర్చించిన ప్రధాన అంశాలు:మహిళలు ఆన్‌లైన్ వేదికగా ఎదుర్కొంటున్న సవాళ్లపై డీఎస్పీ ప్రత్యేకంగా వివరించారు:సోషల్ మీడియాలో మహిళలను వేధించడం, అసభ్యకర సందేశాలు పంపడం వంటి వాటిపైఎలాఫిర్యాదుచేయాలోవివరించారు.అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు. పెళ్లిళ్ల పేరుతో సోషల్ మీడియా మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా జరిగే ఆర్థిక దోపిడీల గురించి హెచ్చరించారు.”సాంకేతికత ఎంతగా పెరుగుతుందో, అంతే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. మహిళలు సోషల్ మీడియా వాడకంలో అప్రమత్తంగా ఉండాలి. బాధితులు భయం వీడి 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular