సిద్దిపేట్ ఏప్రిల్ 9, ప్రజావాణి

సిద్దిపేటలో సంచలనం సృష్టించిన డాక్టర్ ఇంట్లో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు,9 మంది నిందితుల అరెస్ట్ – 20 లక్షల విలువైన ఆస్తి రికవరీ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిద్దిపేట రూరల్ మరియు సి సి ఎస్ బృందాలు.సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బురుగుపల్లి ‘చెర్వితా మెడోస్’లో గత ఏప్రిల్ 4వ తేదీన ఒక డాక్టర్ ఇంట్లో జరిగిన సంచలనాత్మక దోపిడీ కేసును సిద్దిపేట పోలీసులు కేవలం 72 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో నిందితులైన 9 మందిని అరెస్ట్ చేసి, వాళ్ల నుండి సుమారు 20 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపిఎస్ వెల్లడించారు.ఘటన వివరాలు:ఏప్రిల్ 4వ తేదీ రాత్రి 8:00 గంటల సమయంలో, సిద్దిపేటలోని బురుగుపల్లిలో గల డాక్టర్ నివాసంలోకి గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. ఇంట్లోని వారిని కత్తులతో బెదిరించి, తాళ్లతో కట్టివేసి, నగదు మరియు బంగారు ఆభరణాలతో పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు (సి ఆర్ . నెంబర్. 62/2026, యూ / ఏ ఎస్ 331(4), 310(2), 317 (2) ఆర్ / డబ్ల్యూ 49 బి.ఎన్.ఎస్) నమోదు చేశారు. కేసు తీవ్రతను దృష్ట్యా నిందితులను పట్టుకోవడానికి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (సీఐ ఎం. శ్రీను) బాధితుల ఇంటి వద్దే ఫిర్యాదు స్వీకరించి, అక్కడే, ఎఫ్ ఐ ఆర్, కాపీని అందజేశారు. నిరంతరంగా 72 గంటల పాటు శ్రమించి ఈ కేసును ఛేదించారు.ఈ దోపిడీకి మాస్టర్ మైండ్ బెల్లంపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నరేంద్రుల శ్రీకాంత్ @ క్రాంతి (ఏ 1). ఇతడు రామగుండం ఐఓసీ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని ఈ ప్లాన్ వేశాడు. శ్రీకాంత్ తన స్నేహితులైన రాజేష్, శ్యామ్ మరియు చంద్రశేఖర్లతో కలిసి దోపిడీకి ప్లాన్ చేశాడు. ములుగు, భద్రాచలం ప్రాంతాల్లో నేర చరిత్ర కలిగిన గణేష్, ప్రేమ్ చంద్, పవన్ లను ఈ గ్యాంగ్‌లో చేర్చుకున్నాడు.ఏప్రిల్ 4న నిందితులు రెక్కీ నిర్వహించి, రాత్రి 8 గంటలకు డాక్టర్ ఇంటి ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలను కత్తులతో బెదిరించి 8.6 తులాల బంగారం, 1 లక్ష నగదు, ఫోన్లను దోచుకున్నారు. అనంతరం బాధితులను చార్జింగ్ కేబుల్స్ మరియు టవల్స్‌తో కట్టివేసి పారిపోయారు.అరెస్ట్ అయిన నిందితుల*1. నరేంద్రుల శ్రీకాంత్ @ క్రాంతి (41) – రిటైర్డ్ ఆర్మీ (మాస్టర్ మైండ్)2. కల్లూరి గణేష్ (30) – కూలీ, ములుగు (పాత నేరస్థుడు)3. ముత్యబోయిన ప్రేమ్ చంద్ (21) – కూలీ, ములుగు4. బడిశె పవన్ (23) – కూలీ, ములుగు (పాత నేరస్థుడు)5. దుగుట చంద్రశేఖర్ (44) – సింగరేణి ఉద్యోగి, గోదావరిఖని)6. మడిశెట్టి రాజేష్ (39) – డ్రైవర్, గోదావరిఖని”7. అక్కపాక శ్యామ్ (39) – రియల్ ఎస్టేట్, గోదావరిఖని”8. లాడె ప్రకాష్ (26) – రిపోర్టర్ (సొత్తు విక్రయానికి సహకరించిన వ్యక్తి)9. మాచర్ల వినయ్ (20) – పెయింటర్, భద్రాచలం.రికవరీ చేసిన సొత్తు: 4.3 తులాల బంగారు ఆభరణాలు, ఒక బ్లూ యమహా ఆర్ 15 బైక్, ఒక మారుతి డిజైర్ కార్ (టీజీ 09 T 5140), వివిధ కంపెనీలకు చెందిన 10 ఫోన్లు , యాబై వేల రూపాయల నగదు. ఈ కేసును ఛేదించడంలో సమన్వయంతో పనిచేసిన ఏసీపీ ఎం. రవీందర్ రెడ్డి, సిద్దిపేట రూరల్ సీఐ ఎం. శ్రీను, సిసిఎస్, ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్సైలు తిరుపతి, రాజేష్, చంద్రమోహన్, వివేక్, సౌజన్య, శరత్ (ఫింగర్ ప్రింట్ టీం) మరియు ఇతర సిబ్బంది ఎం . రాజు, సుభాష్, యాదగిరి, స్వామి, ఐటీ సెల్ బృందం రమేష్ , శ్రీకాంత్ ను పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, కమ్యూనిటీ ఏరియాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డైల్ 100 కి సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపిఎస్ కోరారు.


