*సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళాబృందం అవగాహన*
రాయికల్:ఫిబ్రవరి 09(ప్రజావాణి)
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు రాయికల్ పట్టణంలోని జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ నందు పోలీస్ కళాబృందం వారు సైబర్ క్రైమ్,గంజాయి నిర్మూలన, షీ టీమ్, మానవ అక్రమ రవాణా,సైబర్ మోసాలు, నివారణ పై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన, కల్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కళాబృందం సభ్యులు పాటలు పాడుతూ ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్లైతే 1930 నంబర్ కి ఫిర్యాదు చేయాలని,యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీపతి రాఘవులు,రవీందర్, అలీ రాజా, గంగ జమున, సత్యనారాయణ, నాగరాజు, పద్మజ, తిరుమల,వనిత, శ్రీకాంత్, గంగాధర్ పోలీస్ సిబ్బంది పూజిత,కమల్,రమేష్, సత్తన్న తదితరులు పాల్గొన్నారు.




