📄 ePaper
Thursday, April 9, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సర్పంచ్ గా చిత్తా రవి ప్రకాష్ రెడ్డి సేవలు మరువలేనివి.

సర్పంచ్ గా చిత్తా రవి ప్రకాష్ రెడ్డి సేవలు మరువలేనివి.

📰 Generate e-Paper Clip

కడప ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 08) సర్పంచ్ గా చిత్తా రవి ప్రకాష్ రెడ్డి సేవలు మరువలేనివి పోరుమామిళ్ల రంగసముద్రం గ్రామ సర్పంచ్‌గా సేవలందించిన చిత్తా రవి ప్రకాష్ రెడ్డి పదవీకాలం ముగిసిన సందర్భంగా, రెడ్డి నగర్‌లోని శ్రీ కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రవి ప్రకాష్ రెడ్డి ఆయన సతీమణి ఆరోగ్య రాణి ని ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువా, నూతన వస్త్రాలు, పంచరత్నావలి మెమొంటోతో ఘనంగా సత్కరించారు. ఆయన గ్రామాభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలు, ఆలయ అభివృద్ధికి చేసిన సేవలను వక్తలు ప్రశంసించారు. రెడ్డినగర్ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు ఆయన సేవలను కొనియాడారు.అనంతరం ఆలయ మర్యాదలతో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు పాలకొలను రామసుబ్బారెడ్డి, గౌరవ అధ్యక్షుడు చాపాటి లక్ష్మీనారాయణరెడ్డి, కమిటీ నిర్వాహకులు రామ్మోహన్ రెడ్డి, సిద్ధమూర్తి రాజారెడ్డి, పాలకొలను రమణారెడ్డి, ప్రగతి శ్రీనివాసులు, పెద్దిరెడ్డి విజయ నరసింహారెడ్డి, నారిసెట్టి నాగేంద్ర, సుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, పోలు రాజారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తోట ప్రసాద్, వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి నగర్ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular