📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్""శుభాల వసంతం రంజాన్ ""ఈద్గాలో జరిగిన ప్రార్థనలలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి

“”శుభాల వసంతం రంజాన్ “”ఈద్గాలో జరిగిన ప్రార్థనలలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి21)రాయచోటి పట్టణంలోని మత సామరస్యానికి ప్రతీకగా రాయచోటి నిలవాలి.ముస్లిం మైనారిటీల సంక్షేమానికి గత జగన్ ప్రభుత్వం పెద్దపీట.రంజాన్ సంధర్బంగా ముస్లిం సోదరులతో కలిసి రాయచోటి పట్టణంలోని ఈద్గాలో జరిగిన ప్రార్థనలలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి శుభాల వసంతం రంజాన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం రాయచోటి పట్టణం లోని ఈద్గాలో జరిగిన నమాజ్ ప్రార్థనలలో ముస్లిం సోదరులు తో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నెల రోజుల పాటు భక్తి శ్రద్దలతో కఠోర ఉపవాస దీక్షలు ఉండి నేడు భక్తి శ్రద్ధలతో,సంతోషాలుతో పండుగ జరుపుకుంతుండడం హర్షణీయమన్నారు.నమాజ్ ప్రార్థనలలో వేలాది మంది పాల్గొనడం హర్షనీయమన్నారు.ఈద్గాలో ప్రార్థనల సౌకర్యార్థంఏర్పాట్లు చేసిన ఈద్గా కమిటీ,మున్సిపల్,ఇతర శాఖల అధికారులు,సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి గత జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.అల్లా దయతో ప్రజలందరూ సుభిక్షంగా,సుఖ సంతోషాలతో జీవించాలని,మత సామరస్యానికి ప్రతీకగా రాయచోటి నిలవాలని ఆయన ఆకాంక్షించారు.ఈద్ ముబారక్ బయ్యా.నమాజ్ ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాంత్ రెడ్డి నమాజ్ ప్రార్థనల అనంతరం శ్రీకాంత్ రెడ్డి ముస్లిం సోదరులును ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.మత పెద్దలనుంచి శ్రీకాంత్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈద్గా అభివృద్ధిలోమాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కృషి అభినందనీయం.ఈద్గా అభివృద్ధిలో మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కృషి అభినందనీయమంటూ ముస్లిం మత పెద్దలు,ముస్లిం సోదరులు పేర్కొన్నారు.ఈద్గా ప్రహరీ గోడ,వజూఖానా నిర్మాణాలు,పెయింటింగ్స్ తదితర అభివృద్ధి పనులలో ఎంపి మిథున్ రెడ్డి,మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ల కృషి ఎనలేనిదంటూ ప్రశంసించారు.మాజీ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,మాజీ వైస్ చైర్మన్ రియాజుర్ రెహమాన్,వైఎస్ఆర్ సిపి మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్,పట్టణ అధ్యక్షుడు నవాజ్,సీనియర్ నాయకులు జమాల్ ఖాన్,అలీ నవాజ్ ఖాన్,జాకీర్,షబ్బీర్,కొలిమి ఛాన్ బాష,ఫయాజ్ అహమ్మద్,ఎస్ పి ఎస్ రిజ్వాన్,జిన్నా షరీఫ్,సాధక్ అలీ,జాఫర్ అలీ ఖాన్, అన్నా సలీం,కొత్తపల్లె ఇంతియాజ్,ఖళీళ్,రైతుమిత్ర ఖాదర్ బాష,నాదర్,హుసేన్,హజరత్ ఖాదర్ వలీ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular