ప్రజావాణి న్యూస్(మార్చి10)అన్నమయ్య జిల్లా మదనపల్లి వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి గ్రామంలో నిర్వహించిన”రైతన్నా మీకోసం”కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో అమలవుతున్న వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలపై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి గ్రామంలో నిర్వహించిన”రైతన్నా మీకోసం”కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని రైతులతో ప్రత్యక్షంగా ముఖాముఖి చర్చించారు.ఈ సందర్భంగా రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకుని,కార్యక్రమం ద్వారా రైతులకు కలుగుతున్న ప్రయోజనాలపై అధికారులను ప్రశ్నించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ,రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.రైతులకు సమగ్ర ప్రోత్సాహం అందించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.”రైతన్నా మీకోసం“కార్యక్రమాన్ని ప్రతి మండలంలో పకడ్బందీగా నిర్వహించి,ప్రభుత్వ పథకాలు,వ్యవసాయ విధానాలు,పంటల ఎంపిక,ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు.స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో వార్షికంగా కనీసం 15 శాతం వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతును ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఐదు దశల్లో కార్యాచరణ అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు భూమి రికార్డులు,ఈ-క్రాప్ నమోదు లోపాలు,సర్వే నంబర్ల మార్పులు,బ్యాంకు రుణాల మంజూరు సమస్యలు, ఉమ్మడి ఖాతాల కారణంగా పాస్ పుస్తకాల జారీ ఆలస్యం వంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.దీనిపై స్పందించిన కలెక్టర్.భూమి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిర్వహిస్తున్న”రెవిన్యూ క్లినిక్స్“ద్వారా ఇప్పటికే అనేక సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించామని తెలిపారు.రైతులు తెలిపిన తాజా సమస్యలను కూడా త్వరితగతిన పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివ నారాయణ,జిల్లా మండల అభివృద్ధి అధికారి, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Homeఆంధ్రప్రదేశ్వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
0
8
RELATED ARTICLES
- Advertisment -




