📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వైయస్సార్ సిపి బద్వేల్ నియోజకవర్గం అసెంబ్లీ పరిశీలకులుగా దుగ్గాయపల్లె మల్లికార్జున్ రెడ్డి ని నియమించారు

వైయస్సార్ సిపి బద్వేల్ నియోజకవర్గం అసెంబ్లీ పరిశీలకులుగా దుగ్గాయపల్లె మల్లికార్జున్ రెడ్డి ని నియమించారు

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్ (మార్చి23) పోరుమామిళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బద్వేల్ నియోజకవర్గం అసెంబ్లీ పరిశీలకులుగా దుగ్గాయపల్లె మల్లికార్జున్ రెడ్డి గారు నియమితులై, మొదటిసారిగా పోరుమామిళ్లకు విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు,నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గారు కలిసి ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం,రాబోయే రాజకీయ వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారి సహకారం,మార్గదర్శకత్వంతో బద్వేల్ నియోజకవర్గం 2004 సంవత్సరం నుంచి పార్టీకి ఇప్పటివరకు విజయ డంకా మోగిస్తుంది, ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసినందువల్లే ఈ విజయ పరంపర కొనసాగుతోందని నాయకులు పేర్కొన్నారు.ప్రతి కార్యకర్త సవ్యసాచిలా పార్టీ బలానికి అండగా నిలుస్తూ ముందుకు సాగితేనే మన లక్ష్యమైన 2029లో జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడగలుగుతామని స్పష్టం చేశారు. 2004 నుంచి ఇప్పటివరకు ఓటమిని ఎరుగని నియోజకవర్గంగా బద్వేల్ నిలవడానికి ఇక్కడి ప్రతి కార్యకర్త చేసిన నిరంతర కృషి ప్రధాన కారణమని అన్నారు. వైయస్ కుటుంబంతో ఈ ప్రాంతానికి ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని, కాంగ్రెస్ కాలం నుంచి ప్రారంభమైన ఈ బంధం వైఎస్ఆర్సిపి స్థాపన తర్వాత మరింత బలపడిందని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఈ ప్రాంతంపై ఉన్న అపారమైన మమకారంతో, ఆయన సీఎం అయిన కొద్ది రోజుల్లోనే బ్రహ్మసాగర్ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు అందించడం ఆయన ప్రజాహిత దృక్పథానికి నిదర్శనమని గుర్తుచేశారు. ప్రతి కార్యకర్త పార్టీకి పట్టుకొమ్మలాంటి వారని, చిన్న కార్యకర్త కూడా దూరమైతే పార్టీకి నష్టం కలుగుతుందని, అందుకే సమిష్టిగా, ఐక్యంగా ముందుకు సాగడం అత్యంత అవసరమని పిలుపునిచ్చారు. రాబోయే కాలం కార్యకర్తలకు మరింత ఆశాజనకంగా ఉంటుందని, ప్రతి ఒక్కరి సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. బద్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నప్పటికీ గతంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదని, అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ బద్వేల్ సమీపంలో సెంచరీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఇకపై కూడా ఇదే సంకల్పంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని, రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని నాయకులు సంకల్పం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ సమన్వయకర్త కల్లూరు రమణారెడ్డి, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు రాజగోపాల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సుదర్శన్, హనుమంతు రెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రవిచంద్ర రెడ్డి, జడ్పిటిసిలు ముత్యాల ప్రసాద్, గురువి రెడ్డి, రాష్ట్ర మరియు జిల్లా అనుబంధ విభాగాల నాయకులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, వంకెల పెద్ద పోలిరెడ్డి, చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి, రాళ్లపల్లి నరసింహులు, గాజులపల్లి రవిచంద్ర రెడ్డి, చిత్తా రాజశేఖర్ రెడ్డి,ఎలిచెర్ల నాగ సుబ్బారెడ్డి, పుల్లలచెరువు ప్రభాకర్ రెడ్డి, హరికృష్ణ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, పోరుమామిళ్ల మండల అబ్జర్వర్ ఓబుల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలసపాడు ఎంపీపీ నిర్మల నారాయణ, పార్టీ సీనియర్ నాయకులు యోగానంద రెడ్డి, రామకృష్ణారెడ్డి,పుల్లారెడ్డి, బోయిళ్ళ ఓబుల్ రెడ్డి, పెసల గణేష్, లక్ష్మిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి,చాపాటి సాయి నారాయణ రెడ్డి, పార్టీ నాయకుల తదితరులు పాల్గొన్నారు*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular