📄 ePaper
Monday, March 30, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamవిద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..!

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..!

📰 Generate e-Paper Clip

. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..!

 

*దర్జాగా విధులకు ఎగనామం..? ప్రైవేటు వ్యక్తికి రోజువారి వేతనం 800 చెల్లించి విధుల నిర్వహణ..?

 

*ఏదైనా విపత్తులు జరిగితే.. ఎవరు బాధ్యత వహిస్తారు అంటున్న రైతులు వినియోగదారులు

 

 

*ప్రభుత్వ రాయితీ.. వేతనం పొందుతున్న వైనం

 

*ఓ మండల సబ్ స్టేషన్ పరిధిలో వవెలుగుచూసిన సదరు అధికారి నిర్వాకం

 

*గత సంవత్సర కాలంగా జరుగుతున్న వ్యవహారం

 

*అంతా అధికారులకు తెలిసే జరుగుతోందా..!

 

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 

విద్యుత్ శాఖలో ఉద్యోగం వెలగబెడుతూ.. అనారోగ్యం చేసింది అంటూ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఓ ప్రైవేటు వ్యక్తికి అక్షరాల 800 రూపాయలు రోజువారి కూలి చెల్లిస్తూ పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఓ సబ్ స్టేషన్ లో దర్జాగా విధులు ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వహించటం సంచలనం కలిగిస్తుంది. సబ్ స్టేషన్ లో విధులు నిర్వహించాల్సిన సదరు అధికారి మండల డివిజనల్ స్థాయి అధికారుల అండదండలతో బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకొని దర్జాగా ఇంటికి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ విషయంపై కళ్ళు ఫిర్యాదులు అందడంతో మన ప్రజావాణి ప్రతినిధి ఇటీవల సబ్ స్టేషన్ లో వ్యవహారాలను తన కెమెరాలో బంధించారు. ఈ విషయంపై సదరు అధికారిని మన ప్రజావాణి వివరణ కోరగా ఆరు నెలల నుండి ఓ వ్యక్తిని సహాయకుడిగా నియమించుకున్నట్లు అంగీకరించడం విశేషం. ఇదే విషయంపై ప్రైవేటు వ్యక్తిని సంప్రదించగా సంవత్సరం నుండి ఆ ఆదికారికి విధులు నిర్వహిస్తున్నట్లు ధ్రువీకరించారు. తనకు 800 రూపాయలు 24 గంటలు గాను చెల్లిస్తున్నట్లు అంగీకరించడ టం కొస మెరుపు.ప్రభుత్వ సేవలు అందించాల్సిన అత్యవసర విభాగంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు అధికారిపై విచారణ చేసి శాఖ పరమైన చర్యలు తీసుకోని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు మండల ప్రజలు కోరుతున్నారు.

 

చాలామంది ఇదేవిధంగా చేస్తున్నారు.. రిటైర్డ్ వాళ్లు కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తున్నారని అధికారిఅంటూ అనేక ఆరోపణలు చేసిన ఆ అధికారి..?పూర్తి ఆధారాలతో.. రెండవ కథనంలో.. మీకోసం..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular