📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialవిద్యార్థులకు సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి యూనిఫామ్ అందజేత

విద్యార్థులకు సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి యూనిఫామ్ అందజేత

📰 Generate e-Paper Clip

విద్యార్థులకు సర్పంచ్ యూనిఫామ్ అందజేత

పిల్లలు శ్రద్దగా చదవాలన్న జగదీశ్వర్ రెడ్డి

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 27(ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూర్ గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు శుక్రవారం రోజున స్థానిక సర్పంచ్ కొంగల జగదీశ్వర్ రెడ్డి వారి సొంత ఖర్చులతో రెండు జతల యునిఫామ్, బెల్ట్ మొదలగునవి జగదీశ్వర్ రెడ్డి తన చేతుల మీదుగా పిల్లలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ…. విద్య దశలో ప్రాథమిక పాఠశాలలో అభ్యసించే చదువు ముఖ్యమైనదని పిల్లలు శ్రద్దగా చదివి ఉన్నత శిఖరాలను అధిగమించాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపండు శంకరయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఆంజనేయులు, చోటేమియా, అమ్మ ఆదర్శ కమిటి చైర్మెన్ రాజారపు కావ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular