📄 ePaper
Sunday, April 5, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetవార్డు సభ్యుల సంక్షేమ సంఘం బెజ్జంకి మండల అధ్యక్షుడిగా పులి శ్రీకాంత్ గౌడ్

వార్డు సభ్యుల సంక్షేమ సంఘం బెజ్జంకి మండల అధ్యక్షుడిగా పులి శ్రీకాంత్ గౌడ్

📰 Generate e-Paper Clip

వార్డు సభ్యుల సంక్షేమ సంఘం బెజ్జంకి మండల అధ్యక్షుడిగా

పులి శ్రీకాంత్ గౌడ్

బెజ్జంకి,ఏప్రిల్ 3(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామానికి చెందిన 5వ వార్డు సభ్యుడు పులి శ్రీకాంత్ గౌడ్ను బెజ్జంకి మండల వార్డు సభ్యుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడిగా నియమించారు.
ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వార్డు సభ్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అతికం రాజేశం గౌడ్ శుక్రవారం పత్రిక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా పులి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, తనను మండల అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు అతికం రాజేశం గౌడ్కు,అలాగే సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు ఎలుక శ్రీశైలం యాదవ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మండలంలోని వార్డు సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని,రాష్ట్ర,జిల్లా నాయకత్వంతో సమన్వయం కొనసాగిస్తూ, తన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular