ప్రజావాణిన్యూస్:రాయచోటి ఇటీవల విడుదల చేసిన రాష్ట్రీయ మిలిటరీ స్కూల్(ఆర్ఎంఎస్)పరీక్ష ఫలితాలలో అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మురళి యుపి స్కూల్ విద్యార్థి పని రామ్ వర్మ 150 మార్కులకు గాను138 మార్కులతో దక్షిణ భారతదేశంలో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల శనివారం రాష్ట్ర రవాణా,యువజన,క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఆర్ఎంఎస్ ర్యాంకు సాధించిన పణి రామ్ వర్మ తల్లిదండ్రులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి ఆర్ఎంఎస్ ర్యాంకు సాధించిన విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలోనే అతి తక్కువ స్కూల్స్ ఉన్న రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ కు రాయచోటి మురళి యుపి స్కూల్ నుండి విద్యార్థి పణి రామ్ వర్మ ఎంపిక కావడం రాయచోటి ప్రాంతానికి గర్వకారణం అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.జవహర్ నవోదయ,రాష్ట్రీయ మిలిటరీ స్కూల్,ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ పోటీ పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్న మురళి యుపి స్కూల్ విద్యార్థులను,పాఠశాల యాజమాన్యాన్ని,ఉపాధ్యాయ బృందాన్ని మంత్రి మండిపల్లి అభినందించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు దుద్యాల రవీంద్రారెడ్డి,బోర్ వెల్స్ సురేష్ రెడ్డి,చెన్న కృష్ణారెడ్డి,శివారెడ్డి,నోబెల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి కొండూరు మురళీమోహన్ రాజు,విద్యార్థి తండ్రి శివరామరాజు తదితరులు పాల్గొన్నారు
రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ర్యాంకర్ ను అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
0
33
Previous article
RELATED ARTICLES
- Advertisment -




