ప్రజావాణి :వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ శాఖలోని ప్రత్యేక విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఐ.పీ.ఎస్ గారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి రోడ్డు ప్రమాదం జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్ ) గుర్తించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి,కడప జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై, ఫ్యాక్షన్ తో సంబంధం ఉన్న వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఐ.పీ.ఎస్ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ శాఖలోని ప్రత్యేక విభాగాలైన ఫ్యాక్షన్ జోన్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, ఎస్.సి ఎస్టీ సెల్, డి.సి.ఆర్.బి, డి.టి.ఆర్.బి., కోర్ట్ మానిటరింగ్ సెల్ తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పీ గారు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ట్రాఫిక్ సి.ఐ లను ఆదేశించారు.ఏ.హెచ్.టి యు : జిల్లాలో ఎక్కడైనా మానవ అక్రమ రవాణా జరుగుతుంటే గుర్తించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సైబర్ క్రైమ్: జిల్లాలో నమోదైన సైబర్ క్రైమ్ కేసులను ఛేదించేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు దర్యాప్తులో సహకరించాలని ఆదేశించారు.జిల్లాలో జరిగిన గ్రేవ్ చోరీ కేసుల్లో దొంగలను అరెస్టు చేసి చోరీ సొత్తు రికవరీ చేసేలా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు దర్యాప్తు లో సహకరించాలని జిల్లా ఎస్.పీ గారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులకు సూచించారు .
కోర్టు మానిటరింగ్ సెల్: తీవ్రమైన కేసులలో విచారణ త్వరితగతిన జరిగి నేర నిరూపణ చేసి నేరస్థులకు శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్.పీ గారు ఆదేశించారు. సాక్షులను సకాలంలో కోర్టులో ప్రవేశపెట్టి ముద్దాయిలకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు.సోషల్ మీడియా సెల్: సోషల్ మీడియా లో మహిళలు , బాలికలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై నిఘా ఉంచి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రెడ్ సాండర్స్ టాస్క్ ఫోర్స్: ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసుల్లో ఉన్నవారి కదలికలపై నిఘా ఉంచాలని పదే పదే స్మగ్లింగ్ కు పాల్పడేవారిపై పీ.డి చట్టం ప్రయోగించాలని జిల్లా ఎస్.పీ గారు ఆదేశించారు.డి.సి.ఆర్.బి : రికార్డులను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలని జిల్లా ఎస్.పీ గారు సూచించారు.శక్తి టీముల బీట్లు పెంచాలని ఈవ్ టీజింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.డి.టి.ఆర్.బి : రోడ్డు pramadlu జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్ ) గుర్తించి ఇతర శాఖల అధికారుల సమన్వయం చేసుకుని ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో అదనపు ఎస్.పీ (అడ్మిన్) శ్రీ కె.ప్రకాష్ బాబు గారు, జిల్లాలోని వివిధ ప్రత్యేక విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలి కడప జిల్లా ఎస్పీ
RELATED ARTICLES




