ప్రజావాణిన్యూస్(మార్చి24)కడప జిల్లా రాజంపేట బైపాస్‌లోని తిరుమల బార్ లో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.బార్ ముందు ఉన్న ఫ్లెక్సీలు,రేకులు మంటల్లో కాలిపోయాయి.క్షణాల్లోనే మంటలు భారీగా చెలరేగి స్థానికులను భయాందోళనకు గురి చేశాయి.ప్రాథమిక సమాచారం ప్రకారం:రేకులపై ఏర్పాటు చేసిన బార్ విద్యుత్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ తగలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానం.సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.వారి వేగవంతమైన చర్యలతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. హెచ్చరిక:భవనాల్లో సరైన విద్యుత్ భద్రతా చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడైనా సంభవించే అవకాశం ఉంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించాలి.
రాజంపేట బైపాస్‌లోని తిరుమల బార్ లో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం
0
12
Previous article
RELATED ARTICLES
- Advertisment -




