సిద్దిపేట్, ఏప్రిల్ 7, ప్రజావాణి
మైనర్ బాలికను వేధిస్తున్న పాత నేరస్థుడి అరెస్ట్: సిద్దిపేట టూ టౌన్ పోలీసుల చర్య ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధిస్తూ, సాక్షులను బెదిరింపులకు గురిచేస్తున్న బర్మా వెంకటేష్ అనే వ్యక్తిని సిద్దిపేట టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.కేసు వివరాలు:సిద్దిపేటలోని హనుమాన్ నగర్‌కు చెందిన బర్మా వెంకటేష్ (తండ్రి: పర్వతాలు), గతంలో ఒక మైనర్ బాలికతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో ఆమెను వేధించడంతో, అప్పట్లో బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదై వెంకటేష్ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. జైలు నుండి విడుదలైన తర్వాత కూడా నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. సదరు బాలిక ఫోటోలను మార్ఫింగ్ చేసి, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె స్నేహితులకు పంపడం ప్రారంభించాడు. అంతేకాకుండా, గతంలో తనపై నమోదైన కేసులోని సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. ఉపేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బర్మా వెంకటేష్‌ను అరెస్ట్ చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు.సోషల్ మీడియా వేదికగా మహిళలను, ముఖ్యంగా మైనర్లను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఉపేందర్ హెచ్చరించారు..



