ప్రజావాణిన్యూస్(మార్చి23)వేసవికాలంలోఅడవి జంతువుల దాహార్తిని తీర్చడం,వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత అని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు పేర్కొన్నారు. సోమవారం అట్లూరు–సిద్ధవటం ప్రధాన రహదారిలోని అటవీ ప్రాంతంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మూగజీవాల దాహాన్ని తీర్చేందుకు 25కు పైగా నీటి తొట్లు ఏర్పాటు చేసి, ట్యాంకర్ ద్వారా నీటిని నింపించారు.డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు మాట్లాడుతూ, వేసవికాలంలో అడవుల్లో నీటి వనరులు ఎండిపోవడంతో వన్యప్రాణులు దాహంతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టామని తెలిపారు. నీటి కోసం జనావాసాల్లోకి వచ్చే క్రమంలో కుక్కల బారిన పడటం, వాహనాల కింద పడటం వంటి ప్రమాదాల నుంచి జంతువులను కాపాడేందుకే ఈ ఏర్పాట్లు చేశామన్నారు.జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వేసవికాలంలో అడవి జంతువులను సంరక్షించడం కేవలం అటవీశాఖ బాధ్యత మాత్రమే కాకుండా మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పోతిరెడ్డి రెడ్డయ్య, అరవ శ్రీనివాసులురెడ్డి, ఓబులరెడ్డి రమణరెడ్డి, పాలకొండ రాజశేఖర్ రెడ్డి, గురుప్రసాద్ రెడ్డి,టీడీపీ మాజీ బద్వేల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కొంకుల రాంబాబు,చిన్నపురెడ్డి తదితరులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మూగ జీవాల దాహార్తి కోసం నీటి తోట్లను ఏర్పాటు చేసిన కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి”
0
15
- Advertisment -




