*మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 9 సాయంత్రం నుండి 11 సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బంద్*
*పోలీస్ కమిషనర్ సునీల్ దత్*
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఫిబ్రవరి11 తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఆయా మున్సిపాలిటీ ప్రాంతాలలో మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. *ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 9 వ తేదీన సాయంత్రం 5:00 గంటల నుండి ఫిబ్రవరి 11 న ఎన్నికలు ముగిసే వరకు మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించారు.* అదేవిదంగా ఫిబ్రవరి *13 న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉదయం 8:00 గంటల నుండి ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు ఖమ్మం జిల్లా పరిధిలోని ఏదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మునిసిపాలిటీ కౌంటింగ్ సెంటర్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, మూసివేయాలని ఆదేశించారు.* ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలలో భాగంగా మూసివేయాలని సూచించారు. *నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.* నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా సహకరించాలని కోరారు.




