📄 ePaper
Sunday, April 5, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddy*మీ సేవలు మరింత విస్తరించాలి**సామాజిక దృక్పథంతో సదర్ శీను సేవలు అమోఘం**బీసీ సేన జాతీయ అధ్యక్షులు...

*మీ సేవలు మరింత విస్తరించాలి*

*సామాజిక దృక్పథంతో సదర్ శీను సేవలు అమోఘం*

*బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ పిలుపు*

📰 Generate e-Paper Clip

*మీ సేవలు మరింత విస్తరించాలి*

*సామాజిక దృక్పథంతో సదర్ శీను సేవలు అమోఘం*

*బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ పిలుపు*


రంగారెడ్డి జిల్లా బీసీ సేన అధ్యక్షుడు సదర్ శీను జన్మదినం సందర్భంగా షాద్‌నగర్ పట్టణ కేంద్రంలోని ఆయన కార్యాలయం సందడి వాతావరణంతో కళకళలాడింది. ఈ సందర్భంగా బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ ప్రత్యేకంగా హాజరై సదర్ శీనుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సదర్ శీను సామాజిక సేవలో చూపిస్తున్న నిబద్ధతను ప్రశంసించారు.బీసీ వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవలు అందించి, మరింత మంది ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
సదర్ శీను మాట్లాడుతూ… తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.బీసీ సేన బలోపేతం కోసం, పేద మరియు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు.జన్మదిన వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. అనంతరం అన్నదానం తదితర సామాజిక సేవలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్,బీసీ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్యాట జయ శ్రీకాంత్,మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సుప్ప ప్రకాష్,బీసీ సేన రంగా రెడ్డి జిల్లా మీడియా అధ్యక్షులు గిరిబాబు,షాబాద్ మండలఅధ్యక్షులు &దామర్ల పల్లి, డిప్యూటీ సర్పంచ్ చారి,షాద్నగర్ నియోజకవర్గం యూత్ అధ్యక్షులు పాలాది శ్రీను షాద్నగర్ ఉపాధ్యక్షురాలు పద్మ చౌదర్ గూడా మండల్ ప్రధాన కార్యదర్శి సంధ్య బాలమణి ఫరూక్నగర్ మండలాధ్యక్షుడు రవికుమార్ చౌదర్ గూడా ఉపాధ్యక్షుడు దామోదర్ కోర్ కమిటీ మెంబర్ చిన్న బాలరాజ్ వీరన్న పల్లి సర్పంచ్ వేణు మరియు వివిధ జేఏసీ పెద్దలు, కొందుర్గ్ మండల అధ్యక్షులు ఈరపురం అనిత గౌడ్,కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సదర్ శీనుకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular