📄 ePaper
Friday, March 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మాజీ ఎమ్మెల్యే శ్రీ ఉన్నం హనుమంతరాయ చౌదరి గారికి ఘన నివాళులర్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో...

మాజీ ఎమ్మెల్యే శ్రీ ఉన్నం హనుమంతరాయ చౌదరి గారికి ఘన నివాళులర్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు..

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి23)అనంతపురంజిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ హనుమంతరాయ చౌదరి గారి అకాల మరణం పార్టీకి తీరని లోటు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మరియు యువనేత శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు అనంతపురం జిల్లాకు వెళ్ళి, వారి భౌతిక కాయానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.అనంతపురం రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించిన హనుమంతరాయ చౌదరి గారు, అత్యంత సౌమ్యుడిగా మరియు రైతు నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. శ్రీనివాసరెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఆయన కూడా జిల్లా అధ్యక్షుడిగా పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. వారితో నాకున్న అనుబంధం ఎన్నటికీ మరువలేనిదని, ఒక సీనియర్ నాయకుడిని కోల్పోవడం పార్టీకి మరియు అనంతపురం జిల్లా రాజకీయాలకు భారీ నష్టమని శ్రీనివాసరెడ్డి గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, శోకతప్త హృదయంతో ఉన్న వారి కుటుంబ సభ్యులకు శ్రీనివాసరెడ్డి గారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular