ప్రజావాణిన్యూస్(మార్చి23)విజయవాడనగరంలోని మాచావరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్ ప్రాంతంలో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ రోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది.
ఈ డ్రైవ్‌ను సీఐ డీవీ రమణ గారు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో చేపట్టారు.ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్ణీత సమయానికి మించి దుకాణాలు తెరిచి నిర్వహిస్తున్న యజమానులపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలను పాటించని దుకాణదారులపై పెట్టి కేసులు నమోదు చేయడం జరిగిందిఈ సందర్భంగా సీఐ గారు దుకాణదారులకు సూచిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలు మరియు పోలీస్ శాఖ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరడమైనది.
మాచావరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్ ప్రాంతంలో ప్రత్యేక డ్రైవ్ ”సీఐ డీవీ రమణ
RELATED ARTICLES




