📄 ePaper
Thursday, April 9, 2026
📄 ePaper
Homeక్రైమ్భారీగా సెల్‌ఫోన్ల రికవరీ. థాంక్యూ ఎస్పీ సార్.. అంటూ జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపిన...

భారీగా సెల్‌ఫోన్ల రికవరీ. థాంక్యూ ఎస్పీ సార్.. అంటూ జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు

📰 Generate e-Paper Clip

వై.ఎస్.ఆర్ కడపజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్08)Operation Mobi Track”లో భాగంగా భారీగా సెల్‌ఫోన్ల రికవరీ.8వ విడతలో భాగంగా రూ.70 లక్షలు విలువైన 505 మొబైల్స్ బాధితులకు తిరిగి అందజేత.థాంక్యూ ఎస్పీ సార్.అంటూ జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు బాధితులకు మొబైల్ ఫోన్లు అప్పగించటంలో ప్రత్యేక చొరవ చూపిన కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్,ఐపీఎస్.ద్వారా కడప జిల్లా సైబర్ క్రైమ్ టీం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం,నెట్‌వర్క్ నిఘా,మరియు డేటా విశ్లేషణా పద్ధతులు ఉపయోగించి భారీ మొబైల్ ఫోన్ రికవరీ ఆపరేషన్‌లో సఫలమయ్యారు.పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మొత్తం 505 మొబైల్ ఫోన్లు రికవరీ చేయబడినవి,వీటి విలువ సుమారు రూ.70,00,000/-ఇప్పటి వరకు8విడతల్లో మొత్తం రూ.11,76,00,000/-విలువైన 5877 మొబైల్ ఫోన్లు రికవరీ చేయబడ్డాయి
Operation Mobi Track”విజయవంతమైన ఆపరేషన్‌కు అధునాతన డిజిటల్ ఫోరెన్సిక్స్,GPS ట్రాకింగ్,IMEI ట్రేసింగ్,మరియు సైబర్ నిఘా టూల్స్ కారణమని జిల్లా SP,తెలియజేసినారు.వై.ఎస్.ఆర్
కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్,IPS ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ టీం ఉపయోగించిన సైబర్ నిఘా టూల్స్ మరియు IMEI ట్రేసింగ్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారంలో మంచి ఫలితాలను చూపిస్తుంది.జిల్లా ఎస్పీ గారి ప్రెస్ మీట్ జిల్లాలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం వల్ల IMEI ఆధారిత ట్రాకింగ్ మరియు డేటా అనలిటిక్స్ పద్ధతుల ద్వారా ఫోన్లు త్వరితగతిన రికవరీ చేశారు.మొబైల్ రికవరీ విషయంలో రాష్ట్ర స్థాయిలో కాకినాడ జిల్లా మంచి ప్రగతి సాధించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు తెలిపారు.సైబర్ మోసాల భారిన పడకుండా ఉండేందుకు పోలీసు వారి సూచనలు:సైబర్ మోసాల నుండి రక్షణ కోసం,అపరిచిత వీడియో కాల్స్ లేదా ఫిషింగ్ కాల్స్ / ఇమెయిల్స్‌కు ప్రతిస్పందించ వద్దు.సైబర్ నేరగాళ్ల మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా సమీపంలో గల పోలీస్ స్టేషన్ సంప్రదించాలి లేదా( https://cybercrime.gov.in) వెబ్సైట్ లో ఫిర్యాధు చేయండి.మొబైల్ మిస్ అయినప్పుడు ( లేదా) దొంగతనం జరిగినప్పుడు తక్షణ కర్తవ్యంగా చేయవలసినవి:బ్యాంకు ఖాతాలను తక్షణమే బ్లాక్ చేయించాలి.సిమ్ కార్డ్ నెంబర్‌ను ఆలస్యం చేయకుండా డిసేబుల్ చేయించుకోవాలి.మొబైల్ పోయిన తక్షణమే గూగుల్ / ఆపిల్ ID,బ్యాంకింగ్ యాప్స్,వాట్సాప్,మెయిల్,సోషల్ మీడియా వంటి వాటి యొక్క పాస్‌వర్డ్లు మార్చండి.ఆండ్రాయిడ్ ఫోన్లకు,Find My Device,ఐఫోన్‌లకు:Find My iPhone (iCloud) ద్వారా ఫోన్‌ను ట్రాక్ చేయడం,రింగ్ చేయడం,లాక్ చేయడం, లేదా డేటా డిలీట్ చేయడం చేయొచ్చు.Ceir.gov.in పోర్టల్ ద్వారా పోయిన మొబైల్ ఫోన్ యొక్క వివరములతో ఫిర్యాదు చేయవచ్చు.సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు జాగ్రత్తలు,ఫోన్ బిల్లు,సెల్ ఫోన్ బాక్స్ మరియు ఫోన్ అమ్మే వ్యక్తి గురించి సరిగా పరిశీలించాలి.అపరిచితుల నుండి ఫోన్లు కొనుగోలు చేయడం ద్వారా సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉంది.జిల్లా లో సైబర్ క్రైమ్ బృందం ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్ల రికవరీకి సంబంధించిన డిజిటల్ ఫోరెన్సిక్స్ ఆధారిత సాంకేతికతను ఉపయోగించడంతో జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్,IPS.సైబర్ క్రైమ్ టీం-ఇన్స్పెక్టర్ శ్రీ.మధు మల్లేశ్వర రెడ్డి,మరియు సంభందిత సిబ్బంది అందరిని అభినందించడం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా ఎస్పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్,IPS.తో పాటుగా,అడిషనల్ ఎస్పి శ్రీ K. ప్రకాష్ బాబు,స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీ.సుధాకర్,స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ శ్రీ U.సదాశివయ్య తదితరులు పాల్గొన్నారు.జిల్లా పోలీస్ కార్యాలయం,కడప.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular