కోదాడలో భక్తిశ్రద్ధలతో వీర హనుమాన్ విజయ యాత్ర..
కోదాడ, ఏప్రిల్ 02/ ప్రజావాణి
కోదాడ పట్టణంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ శోభాయమానంగా జరిగింది. శ్రీరంగాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల అనంతరం ఈ యాత్రను మున్సిపల్ చైర్‌పర్సన్ యెర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, ఏబీవీపీ రాష్ట్ర పూర్వ కార్యదర్శి చింతకాయల ఝాన్సీ ముఖ్య అతిథులుగా హాజరై కొబ్బరికాయలు కొట్టి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తాయని పేర్కొన్నారు.హనుమంతుని ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అతిథులు ఆకాంక్షించారు. పట్టణ పురవీధుల గుండా సాగిన ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, బండారు కవితా రెడ్డి, యాద నవీన్, రచ్చ సతీష్, లక్ష్మి, వెంకటేశ్వరరావు,భూమా గణేష్, కనగాల వెంకటరామయ్య,బొలిశెట్టి కృష్ణయ్య, కనగాల నారాయణ, సాతులూరి హనుమంతరావు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




