*బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం*
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఏకశిలా కొండపై కొలువు దీరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిలా భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బెజ్జంకి లక్ష్మి నర్సింహాస్వామి క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది.
*ఏకశిల గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహస్వామి*
బెజ్జంకి లో ఏకశిల గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని రాతి శిల్పాలు కాకతీయుల కాలం నాటివని పూర్వికులు చెబుతున్నారు.కాకతీయుల కాలంలో రాతి కట్టడంతో నిర్మించిన ఈ ఆలయం శిల్పకళా వైభవానికి ప్రతీక,ఆలయ ప్రాంగణంలో కోనేరులో స్థానమాచరిస్తే దీర్ఘకాలిక శర్మ వ్యాధులు నయమవుతాయని భక్తులను ప్రగాఢ విశ్వాసం, దక్షిణ ముఖంగా స్వయంభువుగా వెలిసిన బెజ్జంకి లక్ష్మినర్సింహా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎందుకు ఆసక్తి చూపుతారు.
*శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆకర్షనగా మేకల బండ్లు*
శకటోత్సవం రోజున సమీప గ్రామాల రైతులు భక్తులు ఎడ్ల బండ్లు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర త్రవాహనాలు గుట్ట చుట్టూ తిప్పడం అన వాయితీ, గుట్ట చుట్టూ తిరిగిన అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు.ఈ యొక్క జాతరలో మేకల బండిని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి చూడడానికి ఆసక్తి చూపుతారు.
*భారీగా తరలిరానున్న భక్తులు*
ఈ యొక్క జాతర ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవానికి కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాలను స్థిరపడ్డ ప్రజలు లక్ష్మీ నరసింహ స్వామిని ప్రతి దర్శించుకుంటున్నారు.
*బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టాలు స్వామివారి రథం*
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత ముఖ్యమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణాన్ని చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా ఆదివారం నిర్వహించనున్నారు. ఆలయ ఆవరణలో ముత్యాల పందిరి వేసి వివిధ రకాల పూలతో సుందరంగా అలరించిన పర్వతాన్ని వేదమంత్రాలతో, మంగళ వాయిద్యాల మధ్య ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 2న శకట ఉత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో చివరిపడకమైన రథోత్సవం వైభవంగా జరుగనుంది, హాయ్ ప్రభుత్వమూర్తులను అందంగా అలరించిన రథంపై భక్తులు తాళ్లతో లాగుతూ గుట్ట చుట్టు ఊరేగిస్తారు.
*లక్ష్మి నరసింహ స్వామి జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు పూర్తి*
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం సాయంత్రం లక్ష్మీ సమేత నరసింహస్వామి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు, జాతరలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, జాతరకు వచ్చే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ కార్యనిర్వాదికారి కొమ్మెర శ్రీధర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.






