📄 ePaper
Sunday, April 5, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetబెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో జిల్లా న్యాయమూర్తుల దర్శనం

బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో జిల్లా న్యాయమూర్తుల దర్శనం

📰 Generate e-Paper Clip

బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో జిల్లా న్యాయమూర్తుల దర్శనం

బెజ్జంకి,ఏప్రిల్ 5(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా న్యాయమూర్తులు దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సాయి రమాదేవి,అదనపు జిల్లా న్యాయమూర్తి జయ ప్రసాద్లకు ఆలయ పూజారి, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రభాకర్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular