📄 ePaper
Sunday, April 5, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetబెజ్జంకి లక్ష్మీనరసింహ స్వామి దర్శించిన బండి సంజయ్‌కు ఘన స్వాగతం

బెజ్జంకి లక్ష్మీనరసింహ స్వామి దర్శించిన బండి సంజయ్‌కు ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

బెజ్జంకి లక్ష్మీనరసింహ స్వామి జాతర విచ్చేసిన కేంద్ర మంత్రిమంత్రికీ ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు

బెజ్జంకి, ఏప్రిల్ 5(ప్రజావాణి)

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆదివారం బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు బెజ్జంకి మండల పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.స్వామి వారి దర్శనం అనంతరం పార్టీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు కరివేద మహిపాల్ రెడ్డి బూత్ అధ్యక్షులు ,పోతుల నర్సయ్య,ఎలుక శ్రీశైలం, ఉపాధ్యక్షులు కంది రాజు, కోరుకొప్పుల యాదయ్య, సీనియర్ నాయకులు గుంటి రాజమల్లు, బొప్పేన కుంటయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular