బెజ్జంకి మండలంలో సంక్షేమ పథకాల చెక్కులు పంపిణీ చేసిన
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
బెజ్జంకి, ఏప్రిల్ 1 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ లబ్ధిదారులకు సంక్షేమ పథకాల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా 21 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 21,02,436 విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులు, అలాగే 87 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 23,47,000 విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను అందజేశారు.అనంతరం, బెజ్జంకి మండలంలోని రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన నూతన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అవసరంలో ఉన్న ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం సహాయం అందిస్తుందని, బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. అలాగే కళ్యాణ లక్ష్మి పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాల్లోని ఆడపిల్లలకు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరు శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు శ్రీకాంత్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




