📄 ePaper
Friday, March 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బాలికల ఉన్నత పాఠశాల నిర్మాణము పట్ల అధికారుల అలసత్వం తగదు. ప్రభుత్వ సొమ్మును దునిర్వియోగం చేస్తున్న...

బాలికల ఉన్నత పాఠశాల నిర్మాణము పట్ల అధికారుల అలసత్వం తగదు. ప్రభుత్వ సొమ్మును దునిర్వియోగం చేస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలి

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్:(మార్చి 11)మైదుకూరు పట్టణము నందు నిర్మాణంలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కార్యదర్శి వీరపోగు రవి బృందం బుధవారం సందర్శించడం జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాల క్రితమే గ్రామ పెద్దలు నంద్యాల రోడ్ లో 91 సెంట్లు కొని బాలికల ఉన్నత పాఠశాలకు జిల్లా పరిషత్ పంచాయతీ అధికారి పేరిట రిజిస్టర్ చేశారని భూములకు రెక్కలు వచ్చి ఆక్రములకు గురి అవుతున్న సమయంలో ఎస్ఎఫ్ఐ పోరాటం ద్వారా నాటి ప్రభుత్వము బాలికల ఉన్నత పాఠశాలకు ఏర్పాటుకు, నిర్మాణం కొరకు జీవో ఇచ్చిందని నిర్మాణం కూడా దాదాపుగా పూర్తి ఉందని, అధికారులు, ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యం వల్ల కోట్లాది ప్రజల సొమ్ము వృధా అవుతుందని, డ్రాప్ ఔట్ నివారించాలని ,బాలిక విద్యను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బాలికలు ఉన్నత పాఠశాలకు , జూనియర్ కాలేజీ వాటికి తిలోదకాలు ఇస్తున్నారని. బాలిక ఉన్నత పాఠశాల నిర్మాణం పూర్తిచేసి అక్కడ ఇంటర్మీడియట్ విద్యకు అవకాశం కల్పించి మైదుకూరు పట్టణంలో పభుత్వ బాలికల కాలేజీ విద్యకు కూడా ఏర్పాటును ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. బాలిక విద్య కోసం ప్రభుత్వం హెచ్చిస్తున్న లక్షలాది రూపాయలు వాటికి వినియోగించే వనరులు నిర్వీర్యం అవుతున్నాయని, లక్షలాది ప్రజల సొమ్మును వెచ్చించి నిరుపయోగానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని, బాలుర, బాలికల పాఠశాల ఒకే ప్రాంగణంలో ఉండుట వలన పలు సమస్యలకు దారి చూస్తున్నాయని దానిని నివారించుటకు బాలిక పాఠశాల తరలించాలని లేనిపక్షంలో బాలికలు, మహిళల ఆధ్వర్యంలో పెద్దయెత్తున ఎస్ఎఫ్ఐ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు లోకేష్ , అభినయ్, అభిషేక్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular