📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarబస్సు టైర్ బ్లాస్ట్ కావడంతో ఫ్లైఓవర్ పై అదుపుతప్పి డివైడర్ కి ఢీ

బస్సు టైర్ బ్లాస్ట్ కావడంతో ఫ్లైఓవర్ పై అదుపుతప్పి డివైడర్ కి ఢీ

📰 Generate e-Paper Clip

బస్సు టైర్ బ్లాస్ట్ కావడంతో ఫ్లైఓవర్ పై అదుపుతప్పి డివైడర్ కి ఢీకొనడం జరిగింది.

 

జమ్మికుంట ఫిబ్రవరి 6 (ప్రజావాణి)

 

హుజురాబాద్.నుండిజమ్మికుంటకు వచ్చే ఆర్టీసీ బస్సు ఫ్లైఓవర్ ఎక్కే క్రమంలో టైర్ బ్లాస్ట్ అయి డివైడర్లకు ఢీ కొట్టడం జరిగింది చాలామంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడం జరిగిందిజమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ పైశుక్రవారం బస్సు ప్రమాదానికి గురైంది. హుజూరాబాద్ నుంచి జమ్మికుంటకు వస్తున్న బస్సు టైర్ బ్లాస్ట్ కావడంతో ఫ్లైఓవర్ పై అదుపుతప్పి డివైడర్ కి ఢీకొనడం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో పలువురు ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు సహకరించారు. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, గాయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular