📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బద్వేల్ నియోజకవర్గంలో భూ మాఫియా ను అరికట్టి పేదలకు భూములు పంచాలి అనుభవంలో ఉన్న...

బద్వేల్ నియోజకవర్గంలో భూ మాఫియా ను అరికట్టి పేదలకు భూములు పంచాలి అనుభవంలో ఉన్న పేదలకు పట్టాలివ్వాలి సి.పి.ఐ

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి24)బద్వేల్ అర్హులైన పేదలకు ఇండ్లు,ఇంటి స్థలం,ఇంటి నిర్మాణానికి 5లక్షలు, టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు స్వాధీనం,సాగు భూమి ఇచ్చే వరకూ పోరాటం బద్వేల్ ఆర్ డి ఓ కార్యాలయం ముట్టడి లోపి హరినాథ్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్నికల హామీలు అమలు చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి పడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు,గ్రామాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం,టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు స్వాధీనం,భూమిలోని నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేసి,బాడుగ ఇంట్లో ఉండే పేదవారికి అద్దె చెల్లించాలని కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలు అమలు చేసే వరకూ పోరాడతామని మంగళ వారం స్థానిక ఆర్ డి ఓ కార్యాలయం ముట్టడి లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి హెచ్చరించారు.ఈ సందర్భంగా స్థానిక సిపిఐ కార్యాలయం వద్ద నుండి భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇండ్లు ఇస్తాం !ఇంటి స్థలం ఇస్తాం !!రేషన్ కార్డు,పెన్షన్ తోపాటు మౌలిక సదుపాయాలైన రోడ్లు కాలువలు వీధిలైట్లు 24 గంటలు త్రాగునీరు అందించి భూమి లేని నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేసి ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వానికి సాధికారతకు పెద్దపీట వేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఓట్లు దండుకొని అందలమెక్కగానే ఎన్నికల వాగ్దానాలు పూర్తిగా పక్కకు నెట్టి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడడం పరిపాటిగా మారిందన్నారు.పేదవాడికి జానెడ జాగా ఇవ్వడానికి నిరాకరిస్తున్న పాలక ప్రభుత్వాలు,వారికి వత్తాసు పలికే అధికారులు విలువైన ప్రభుత్వ వంక వాగు చెరువు రస్తా అసైన్డ్ దేవాదాయ ఈనాం వక్ఫ్ అటవీ భూములను యదేచ్చగా ఆక్రమించి అమ్ముకుని సొమ్ము చేసుకునే భూ మాఫియా కొమ్ముకాస్తున్నారు అని,భూమి లేని నిరుపేదలకు భూమి పంపిణీ చేసే అసైన్మెంట్ కమిటీ  పోరాడి సాధించుకుంటే చట్టాన్ని సమూల మార్పులు చేసి ఫ్రీ హోల్డ్ పేరుతో ఒక్క సారిగా దళితులను భూమికి దూరం చేసే దుస్సాహసానికి ఒడిగట్టారు అని విమర్శించారు. పారిశ్రామిక అవసరాల పేరుతో,సంస్థల పేరుతో అయిన వారికి ఐదు లక్షల విలువ చేసే ఎకరా భూమిని అర్ధ రూపాయికి కట్టబెట్టడం,ఎక్కడ,ఎవరికి భూమి కావాలన్నా దళితులు,పేదల చేతుల్లో ఉన్న భూములే గుర్తుకు వచ్చే పాలక ప్రభుత్వాలు ఎవరున్నా దోపిడీలో సారూప్యత,సమన్వయం,సఖ్యతను చాటే మేక వన్నె పులులను ఎదుర్కోవాలంటే సామాన్య,పేద,మధ్య తరగతి ప్రజలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి అన్నారు.ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అందరికీ ఇల్లు అనే నినాదంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి కనీసం గుణాదికి కూడా సరిపోని 1లక్ష 50వేలు అందిస్తామంటూ,ఇంటి స్థలం, రోడ్లు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనంటూ ప్రధాన బాధ్యత నుండి

తప్పుకుంటున్నది.రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 68,000 ఎకరాల్లో,17000 కాలనీలు 32లక్షల మందికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1లక్ష 50 వేల తో పాటు అదనంగా 30 వేలు జోడించి 1లక్షా 80 వేలతో ఒక సెంటు స్థలంలో ఇంటి నిర్మాణానికి 30.75 లక్షల మందికి బలవంతపు రిజిస్ట్రేషన్లు చేయించి ఆరు మాసాల్లో పూర్తి చేయకపోతే రద్దు చేస్తామంటూ హుకుం జారీ చేయడంతో 7.43 లక్షల మంది ఐదు రూపాయలు వడ్డీ రుణాలు తెచ్చి అప్పుల పాలై ఆ ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే అమ్మకానికి పెట్టినవారు,ఒక్క సెంటు స్థలం సరిపోదంటూ 21.76 లక్షల మంది ససేమీరా ఒప్పుకొని వారు,నిర్మాణ వ్యయం పెంచాలన్న వారి ఆలోచనలకు ఆజ్యం పోస్తూ తాను అధికారంలోకి రాగానే పట్టణాల్లో 2 సెంట్లు,గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం,ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఆర్థిక సహాయం,భూమి లేని నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేస్తానంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు కావస్తున్న అమలు చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ డొంక తిరుగుడు షరతులతో పేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల్లో అతి ముఖ్యమైన ఇండ్లు ఇంటి స్థలం వాగ్దానం అమలు చేయాలని సిపిఐ చేపట్టిన దశల వారి పోరాటాలకు దిగివచ్చి  G.O.Ms.No.23 (27-01-2025) విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం దరఖాస్తు చేసుకునేవారు జీవితంలో ఇప్పుడే గాని ఎక్కడ గాని ఇంటి స్థలం పొందినట్లు గాని,ఇంటి పన్ను,కరెంట్ బిల్లు తన పేరు మీద ఉండరాదని చివరకు జగనన్న కాలనీలో ఇంటి పట్టా పొంది ఇండ్లు కట్టుకోకపోయినా ఇంటి స్థలం పొందడానికి అనర్హులంటూ చావు కబురు చల్లగా చెప్పినట్లు చంద్రబాబు ప్రభుత్వం పేద ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు అన్నారు.ఇంటి స్థలం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన షరతులు సడలించి గత ప్రభుత్వంలో ఇంటి నిర్మాణం చేపట్టని వారికి,ఇంటి స్థలం తీసుకొని వారికి, ఇంటి స్థలం మంజూరు కాని వారికి ప్రస్తుత ప్రభుత్వం పట్టణాల్లో రెండు సెంట్లు,గ్రామాల్లో మూడు సెంట్లు కేటాయించి, పెరిగిన సిమెంటు స్టీలు ఇసుక కంకర ఇటుక కూలి ధరలకు అనుగుణంగా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించాలని,రోజువారి కూలీకి పోయినా పూట గడవక అద్దె చెల్లించలేక అవస్థ పడుతున్న కుటుంబాలకు అద్దె చెల్లింపుకు ప్రభుత్వ ఆర్థిక భరోసా అందించి ఆదుకోవాలని, భూమిలేని గ్రామీణ నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేయాలనీ,టిడ్కో ఇండ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని, అనుభవం లో ఉన్న తిరుపతి రెడ్డి కాలనీ,భగత్ సింగ్ నగర్,సి ఆర్ నగర్,ఏబీ బర్ధన్ కాలనీ, ఎద్దుల  రెడ్డి కాలనీ వాసులకు ఇంటిపట్టాలు,పాస్ బుక్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అనంతరం ఆర్ డి ఓ చంద్రమోహన్ కు వినతిపత్రం ఇచ్చి సమస్యలు వివరించగా అభ్యంతరం లేని సమస్యలన్నీ పరిష్కారానికి కృషి చేస్తానని,ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు పోతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర,కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్,పి బాల ఓబయ్య,గంగా సురేష్,మస్తాన్, ఇమ్మాన్యుయేల్,పివి రమణ,పడిగే వెంకట రమణ,రవికుమార్, పెంచలయ్య, నాగరాజు,శేషారెడ్డి,కేశవ, సునీల్,ప్రసాద్,విజయమ్మ,వెంకటయ్య, పిరయ్య,సఫా,ఓబులపతి,తదితరులు పాల్గొన్నారు. అభివందనములతో.పి మస్తాన్ సిపిఐ బద్వేల్ ఏరియా కార్యదర్శి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular