ప్రజావాణిన్యూస్(మార్చి23)కడపరె చ్చగొట్టినామత్స్యకారులు వైసీపీ మాటలు నమ్మరుసంక్షోభం ఉన్నా పాత రెట్లకే ఆయిల్.క్రమం తప్పకుండా బోట్లకు ఆయిల్ సబ్సిడీ వేట నిషేధ సమయంలో ప్రతి అర్హునికి మత్స్యకార సేవ లబ్ది టిడిపి జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటిస్ ఫెడరేషన్ ఛైర్మెన్ యాటగిరి రాంప్రసాద్ మత్స్యకారుల అభివృద్ధి,సంక్షేమంతో పాటు అన్ని రకాలుగా మేలు జరిగినా.జరగబోతోందన్నా.అది తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని.సముద్రంలో మన రాష్ట్ర పరిధిలోకి ఇతర రాష్ట్ర బోట్లు అక్రమంగా చొరబడితే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంతోందని.నాలుగు శాఖల సిబ్బందితో ప్రత్యేక పెట్రోలింగ్ బోట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆప్కాఫ్ ఛైర్మెన్ యాటగిరి రాంప్రసాద్ స్పష్టం చేశారు.నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలోని మత్స్యకారుల గ్రామాలలో నాలుగు రోజులుగా జరుగుతున్న సమస్యలను గుర్తించి.మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు,కమ్యూనిటీ మంత్రి కొల్లు రవీంIద్ర గారి సూచనలతో ప్రభుత్వం వెంటనే స్పందించి.శాశ్వత పరిష్కారం చేసేందుకు మన సరిహద్దులోకి అక్రమంగా చొరబడుతున్న తమిళనాడు, పాండిచేరీ రాష్ట్రాలకు చెందిన బోట్లను అరికట్టేందుకు గస్తీ నిర్వహించాలని.అందుకు నిన్నటి నుంచి తక్షణమే చర్యలు తీసుకోవడం.మొదటి రోజే అటవీ,మత్స్య శాఖ, మెరైన్ పోలీస్, స్థానికి ఫిషింగ్ బోట్ల సభ్యుల పర్యవేక్షణలో జరిగిన గస్తీ లో రెండు తమిళనాడు బోట్లను పట్టుకోవడం కూడా జరిగిందన్నారు.మన మత్స్యకారుల శ్రేయస్సు కొరకు 1994 ఫిషరీస్ చట్టాన్ని కొంత మేర సవరణలు చేసి.డ్రోన్ టెక్నాలజీ ద్వారా అక్రమంగా చొరబడుతున్న బోట్లను గుర్తించి.వారి రాష్ట్రాలకు సమాచారం ఇవ్వడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.పచ్చిమ ఆసియా లో యుద్ధం కారణంగా పరిశ్రమల ఆయిల్ ధర లీటరకు 23 రూపాయలు పెరిగిందని.ఆ భారం మత్స్యకారుల బోట్లపై పడకూడదని అచ్చెన్నాయుడు గారు,కొల్లు రవీంద్ర గారి సూచనలతో కూటమి ప్రభత్వం,ఆప్కాఫ్, మత్స్యశాఖ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని.ఆయిల్ సంక్షోభం ఉన్నా.మత్స్యకారుల బోట్లకు గత రేట్ల మాదిరిగానే ఆయిల్ సరఫరా చేస్తున్నామని.వేట నిషేధ సమయంలో అర్హులైన ప్రతి మత్స్య కారునికి 20వేల చొప్పున వారికి అందుతోందని.అర్హులైన కొత్త సభ్యులకు కూడా మత్స్యకార సేవ లబ్దిని అందిస్తామన్నారు.వాస్తవం ఇలా వుంటే వైసీపీ నాయకులు,విషం చిమ్మే సాక్షి మీడియా అవాస్తవాలు ప్రచురించడం,ప్రసారం చేయడం మత్స్యకారులకు ద్రోహం చేసినట్లేనన్నారు.ఇలాంటి వైసీపీ కుట్రలను అటు మత్స్యకారులు,ఇటు ప్రజలు నమ్మరని కూటమి సర్కారుకు అండగా ఉంటారన్నారు.ఈ సమావేశంలో మీడియా కో ఆర్డినేటర్ జనార్ధన్,5వ డివిజన్ ఇంఛార్జి కొమ్మలపాటి సురేష్,టీడీపీ నాయకులు బత్తల వెంకట్,వర్ధిబోయిన రాము తదితరులు పాల్గొన్నారు.
Homeఆంధ్రప్రదేశ్ఫిషింగ్ బోట్ల అక్రమ చొరబాటు నియంత్రణకు ప్రత్యేక చర్యలు మన రాష్ట్ర సరిహద్దుల్లో పెట్రోలింగ్...
ఫిషింగ్ బోట్ల అక్రమ చొరబాటు నియంత్రణకు ప్రత్యేక చర్యలు మన రాష్ట్ర సరిహద్దుల్లో పెట్రోలింగ్ బోటు
0
6
- Advertisment -



