ప్రజావాణిన్యూస్(మార్చి23)ప్రొద్దుటూరురాజకీయ చతుర్వేది వ్యూహంలో యువ కిరీటానికి బ్రహ్మరథం.ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న నవ శకం.రాజకీయ రణక్షేత్రంలో అజేయశక్తిగా,రాయలసీమ ముఖచిత్రాన్ని తన కనుసైగలతో శాసించగల ధీశాలి.రాజకీయ భీష్ముడు,నంద్యాల వరదరాజుల రెడ్డి తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించారు.మున్సిపల్ పాలకమండలి గడువు ముగిసి,చట్టం తన పని తాను చేసుకుపోతున్న తరుణంలో.ప్రొద్దుటూరు పురపాలక రథసారథిగా భూమిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి పేరు ఖరారు కావడంతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.ఇది కేవలం పదవీ బాధ్యతల స్వీకారం కాదు,ప్రొద్దుటూరు భవిష్యత్తును మార్చివేసే ఒక నాయకుడి విజయఢంకా.యువ నాయకుడికే పట్టం.మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలనే ఉత్కంఠకు తెర దించుతూ,ఇటీవల పెద్దాయన వరదరాజుల రెడ్డి కీలక నేతలతో అంతర్గత సమావేశం నిర్వహించారు.సీనియర్ కౌన్సిలర్లను పిలిచి,ఈ పీఠాన్ని మీలో ఎవరు కైవసం చేసుకుంటారు.అని అడిగినప్పుడు అక్కడ ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ పదవి కోసం ఆశపడకుండా,సదరు కౌన్సిలర్లు పెద్దాయనకు నమస్కరించి,వద్దు పెద్దాయనా.మాకు ఈ అధికారం వద్దు.మా అందరినీ నడిపించే సత్తా,ప్రొద్దుటూరును ప్రక్షాళన చేసే శక్తి ఒక్క సూర్యప్రతాప్ రెడ్డికే ఉంది. ఆ యువ నాయకుడికే ఈ అవకాశాన్నీ ఇవ్వండి.ఆయన నాయకత్వంలో సైనికుల్లా పనిచేస్తాం అని ముక్తకంఠంతో చెప్పారట.ఇది ఆ యువ నాయకుడిపై ఉన్న అచంచలమైన విశ్వాసానికి, ఆయన వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం.పెద్దాయన వ్యూహం.సూర్యప్రతాప్ ప్రతాపం.
రాజకీయం అంటేనే ఎత్తుగడలు.ఆ ఎత్తుగడలకు నిలువెత్తు రూపం వరదరాజుల రెడ్డి. ఆయన వేసే ప్రతి అడుగు ప్రత్యర్థుల రాజకీయ సమాధికి పునాది వేస్తుంది. ఇప్పుడు ఆయన తన నీడలో పెరిగిన,రాజకీయ చతురత పుణికిపుచ్చుకున్న సూర్యప్రతాప్ రెడ్డిని రంగంలోకి దించడం వెనుక భీకరమైన వ్యూహం దాగి ఉంది.సూర్య రథచక్రాల వేగంతో దూసుకువచ్చే ఈ యువ కిరీటం,పురపాలక వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి తిమింగలాలను వేటాడటం ఖాయమని స్పష్టమవుతోంది.పెద్దాయన అభయహస్తం ఉంటే.ఎదురు నిలిచిన వాడికి పుట్టగతులు ఉండవు అన్న సత్యాన్ని విశ్లేషకులు మరోసారి నొక్కి చెబుతున్నారు.
ప్రజల నీరాజనం.యువత ఉత్సాహం.ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు,ముఖ్యంగా ఉర్రూతలూగుతున్న యువత,ఈ యువ నాయకుడి రాక కోసం హారతులు పడుతూ వేచి చూస్తున్నారు.మా పురపాలక వ్యవస్థను మార్చే మొనగాడు వస్తున్నాడు అంటూ ప్రజల మనసుల్లో ఒక కొత్త ఆశ చిగురించింది.నియోజకవర్గంలోని ప్రతి గల్లీలోనూ సూర్యప్రతాప్ రెడ్డి పట్టాభిషేకం గురించే చర్చ జరుగుతోంది.అత్యంత భీకరమైన పదజాలంతో,ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ సాగుతున్న ఈ రాజకీయ ప్రయాణం,ప్రొద్దుటూరు చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోనుంది.రాజకీయ దురంధరుడు వరదరాజుల రెడ్డి మార్గదర్శకత్వంలో, సూర్యప్రతాప్ రెడ్డి మున్సిపల్ పీఠాన్ని అధిరోహించడం అంటే. అది ప్రొద్దుటూరు అభివృద్ధికి అంకురార్పణే కాదు,ప్రత్యర్థుల పతనానికి నాంది కూడా..!
ప్రొద్దుటూరు మున్సిపల్ పీఠంపై భూమి రెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి
RELATED ARTICLES




