కడప జిల్లాప్రజావాణి న్యూస్ఏప్రిల్08)ప్రొద్దుటూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతం ప్రస్తుతం ప్రయాణికులకు ఒక నరకప్రాయంగా మారింది.ఒకవైపు భానుడి భగభగలు,మరోవైపు ఆటో డ్రైవర్ల ఆగడాలతో సామాన్య జనం అల్లాడిపోతున్నారు.నిబంధనలను తుంగలో తొక్కి, ఆర్టీసీ బస్సులను చుట్టుముడుతున్న ఆటోల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రయాణికుల వస్తువులపై దౌర్జన్యం ఆర్టీసీ బస్సు స్టాండ్‌లోకి రాగానే కనీసం 15 నుంచి 20 ఆటోలు బస్సును చుట్టుముడుతున్నాయి.ప్రయాణికులు కిందికి దిగకముందే వారి చేతుల్లోని బ్యాగులను,సామాన్లను బలవంతంగా గుంజుకుంటూ తమ ఆటోల్లో వేసుకోవడం ఇక్కడ నిత్యకృత్యమైంది.ఈ క్రమంలో ఆటో డ్రైవర్ల మధ్య జరిగే పెనుగులాటలో ముసలివారు,మహిళలు కిందపడి కాళ్లు,చేతులు విరగ్గొట్టుకుంటున్న ఘటనలు అనేకం.ప్రయాణికుల పట్ల మర్యాదను మరచి,రాక్షసంగా వ్యవహరిస్తున్న వీరి తీరుపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు.ఎండలో ఎండిపోతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆవేదన.ఈ అరాచకాన్ని అదుపు చేసేందుకు విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం వరకు ఎండలో నిలబడి ఆటోలను క్రమబద్ధీకరించడం వారికి సవాలుగా మారింది.ఈ విషయమై ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.ఎంతగా హెచ్చరించినా,ఎన్నిసార్లు పంపించినా ఆటో వాళ్లు వినడం లేదు.ఒంటరిగా నేను ఇంతమందిని ఎలా అదుపు చేయగలను.ఈ వేసవి ఎండలో గంటల తరబడి నిలబడినా పరిస్థితిలో మార్పు రావడం లేదు.ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు ఫోటోలతో సహా నివేదిస్తున్నాను.మా బాధ వర్ణనాతీతం.అధికారులు స్పందించాలి కేవలం ఒక్క కానిస్టేబుళ్లతో కాకుండా,ఇద్దరు ముగ్గురు కానిస్టేబుళ్లను మోహరించి ఆటో డ్రైవర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.ప్రయాణికుల రక్షణ దృష్ట్యా,పాత బస్టాండ్ వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై సీఐ మరియు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది
ప్రొద్దుటూరు పాత బస్టాండ్ వద్ద ..ఆటో.. అరాచకం..ప్రయాణికులపై రాక్షసత్వం.!
0
9
- Advertisment -




